సరికొత్తగా శింబు ‘రీవైన్డ్’ టీజర్..

సరికొత్తగా శింబు ‘రీవైన్డ్’ టీజర్..

Maanaadu Teaser: ‘గోవా’, ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యాని’, ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. శిలంబరసన్ శింబు కథానాయకుడు.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్.. దర్శకుడు ఎస్.జె.సూర్య కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాను ‘రీవైన్డ్’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ టీజర్ రిలీజ్ చేశారు.
అంతా రివర్స్‌లో ‘రీవైన్డ్’ లా చూపించి సినిమా కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. శింబు సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు.

Simbu

త్వరలో భారీగా రిలీజ్ కానున్నఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : రిచర్డ్ ఎమ్ నాథన్, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, యాక్షన్ : స్టంట్ సిల్వ, లిరిక్స్ : మధన్ కార్కే, కొరియోగ్రఫీ : రాజు సుందరం, బ్యానర్ : వి హౌస్ ప్రొడక్షన్స్.