Rocketry: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రాకెట్రి..!

తమిళ నటుడు మాధవన్ నటించిన రీసెంట్ మూవీ ‘రాకెట్రి - ది నంబి ఎఫెక్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Rocketry: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రాకెట్రి..!

Madhavan Rocketry Movie Locks Ott Release Date

Rocketry: తమిళ నటుడు మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రి – ది నంబియార్ ఎఫెక్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను మాధవన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మాధవన్ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఇక ఈ సినిమాను ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత ఆధారంగా తెరకెక్కించినట్లు మాధవన్ తెలిపారు.

Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..

కాగా ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంలో సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో మాధవన్ పర్ఫార్మెన్స్, అతడి మేకోవర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. రాకెట్రి సినిమాను జూలై 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్‌.. ఏకిపారేసిన నెటిజన్లు..!

ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో సిమ్రాన్, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.