రిటైర్ అయిన సైనికుడిని అరచేతులపై నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చిన గ్రామస్తులు..‘సెల్యూట్ సైనికా’అంటూ ఘన స్వాగతం

రిటైర్ అయిన సైనికుడిని అరచేతులపై నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చిన గ్రామస్తులు..‘సెల్యూట్ సైనికా’అంటూ ఘన స్వాగతం

MP soldier Villagers set foot on ground welcome : దేశం కోసం కన్నవారిని కట్టుకున్నవారిని వదిలి..వేల కిలోమీటర్ల దూరం వెళ్లి దేశం కోసం..ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించే జవాలన్ల త్యాగాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..గడ్డకట్టే చలిలోనే..మండిపోయే ఎండల్లోను శతృవుల నుంచి దేశాన్ని కాపాడే వీర జవాన్ల త్యాగాలకు విలువ కట్టలేం. అలా దేశం కోసం జీవితాన్నే అర్పించి రిటైర్ అయిన సొంత గ్రామం చేసుకున్న ఓ జవానుకు గ్రామస్తులు వినూత్నంగా స్వాగతం పలికారు.

భారత సైన్యంలో 17 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ చేసి స్వగ్రామానికి వచ్చిన మాజీ సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లా జిరాన్ గ్రామంలో వెలుగుచూసింది. జిరాన్ గ్రామానికి చెందిన నాయక్ విజయ్ బి సింగ్ సైనికుడిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసి స్వగ్రామానికి వచ్చిన విజయ్ కు గ్రామస్థులు వినూత్న ఘన స్వాగతం చెబుతూ తమ అరచేతులు కింద పెట్టి దానిపై నుంచి అడుగు నేల మీద పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చారు. ఆ జవాను అడుగులకు మగుడులు ఒత్తుతూ..‘సైనికా సెల్యూట్’ అంటూ అరచేతులమీద నడిపిస్తూ ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లా జిరాన్ గ్రామానికి చెందిన నాయక్ విజయ్ బి సింగ్ సైనికుడిగా 17 సంవత్సరాలు పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసి స్వగ్రామానికి వచ్చిన విజయ్ కు గ్రామస్థులు వినూత్న ఘన స్వాగతం చెబుతూ తమ అరచేతులు కింద పెట్టి దానిపై నుంచి అడుగు నేల మీద పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చారు.

తనకు లంభించిన ఈ ఘనస్వాగతానికి సింగ్ తెగ సంబరపడిపోయారు. గ్రామస్తులకు తనమీదున్న ప్రేమాభిమానాలకు,గౌరవాలకు చలించిపోయారు. ఈ సందర్భంగాసింగ్ మాట్లాడుతూ..‘‘నేను 17 సంవత్సరాల 26 రోజులు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాను. నా ఊరికి వచ్చినపుడు మా గ్రామస్థులు నన్ను అడుగు కింద పెట్టకుండా ఇంటి వరకూ తీసుకొచ్చారు. దీనికి నేనెంతో గర్వపడుతున్నాను’’ అని విజయ్ సింగ్ తెలిపారు.

కాగా..నాయక్ విజయ్ సింగ్ 2004 జనవరి 3న సైన్యంలో చేరి జమ్మూకశ్మీర్, కార్గిల్,లేహ్ లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జైపూర్ , బికనీర్ లలో పనిచేశారు. సింగ్ తన గ్రామమైన జిరాన్ యువత ఆర్మీతోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరేందుకు వీలుగా ట్రైనింగ్ ఇవ్వటానికి తన సహచరులతో కలిసి సైనిక స్కూల్ ప్రారంభిస్తానని సింగ్ చెప్పారు. కాగా..జిరాన్ గ్రామం నుంచి 60 మంది సైన్యంలో పనిచేస్తున్నారు.