Madhya Pradesh: దళిత విద్యార్థినికి అవమానం.. కుటుంబ సభ్యులపై దాడి

స్థానికులైన ఒక గ్రూప్ దళిత బాలికపై దాడి చేసి స్కూల్‌కి వెళ్లకుండా ఆపేశారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితురాలి కుటుంబంపై కూడా దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని బవాలియఖేదీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Madhya Pradesh: దళిత విద్యార్థినికి అవమానం.. కుటుంబ సభ్యులపై దాడి

Girl Gang Rape

 

 

Madhya Pradesh: స్థానికులైన ఒక గ్రూప్ దళిత బాలికపై దాడి చేసి స్కూల్‌కి వెళ్లకుండా ఆపేశారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితురాలి కుటుంబంపై కూడా దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని బవాలియఖేదీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్కూల్‌కు వెళ్తున్న బ్యాగ్.. లాగడంతో పాటు క్లాసులకు అటెండ్ కాకుండా చేశారు. ఆమె సోదరుడ్ని తిట్టడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా కొట్టినట్లు విద్యార్థిని చెప్పింది. షెడ్యూల్ కాస్ట్ కు చెందిన మైనర్ విద్యార్థిని స్కూల్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని కొట్వాలి పోలీసు అధికారి అవదేశ్ కుమార్ శేషా పేర్కొన్నారు.

గ్రామంలోని ఇతర బాలికలు పాఠశాలకు వెళ్లనప్పుడు దళిత విద్యార్థిని కూడా వెళ్లకూడదంటూ బాలిక స్కూల్ బ్యాగ్‌ను లాక్కెళ్లారని ఆరోపించారు. అనంతరం బాలిక కుటుంబీకులు, నిందితుల బంధువుల మధ్య ఘర్షణ చెలరేగిందని తెలిపారు.

Read Also: దళితుడి నోట్లో ఆహారం తీసుకుని తిన్న కర్ణాటక ఎమ్మెల్యే.. కంగుతిన్న స్థానిక ప్రజలు

ఫిర్యాదు మేరకు ఐపీసీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద సోమవారం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

ఘర్షణలో గాయపడిన వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు.