walked in fires : నిందలు వేసిన అత్త..నిప్పుల మీద నడిచిన కోడలు

అత్త కోడలిపై నిందలు వేసింది. అత్త వేసిన నిందలు నిజం కాదని నిరూపించుకోటానికి కోడలు కణకణమండే నిప్పుల మీద నడిచిన ఘటన..

walked in fires : నిందలు వేసిన అత్త..నిప్పుల మీద నడిచిన కోడలు

Daughter In Law Walked In Fires

Daughter in law walked in fires : అత్త మోపిన నిందను నిజం కాదని నిరూపించడానికి కోడలు కాళ్లకు చెప్పులు లేకుండా నిప్పులపై నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రామ్‌కోన గ్రామంలో ఆగస్ట్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది.ఇది సర్వసాధారణమే.కానీ అత్త నోటికి హద్దు పద్దూ లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతు కోడలిని అనరాని మాటలు అంది. నిందలు వేసింది. దీంతో కోడలు ‘అత్తా నువ్వు మాట్లాడేది బాగాలేదు..నువ్వు నామీద నిందలేస్తున్నావు..’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆ తరువాత అత్త నిందలకు తీవ్ర మనస్తాపానికి గురైన కోడలు నిప్పులు మీద నడిచిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని రామ్‌కోన గ్రామంలో నివసించే ఓ కుటుంబంలో అత్తాకోడలి మధ్య గొడవొచ్చింది. కోడలు తప్పు చేసిందని..ఇక తన కొడుకుతో కాపురం చేయటానికి వీల్లేదని అత్త ఆరోపించింది. దాని కోడలు తాను ఏ తప్పూ చేయలేదని నెత్తీనోరు బాదుకుని విలపించింది. కానీ అత్త వినలేదు. ఇక నీకూ మాకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పింది. కోడలు మాత్రం నేను ఏ తప్పూ చేయలేదు..నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి? అంటూ ఆవేదన వ్యక్తంచేసింది.ఈ వ్యవహారం కాస్తా ఊరిలోని బాబా వద్దకు చేరింది. ఆయన ఆ కోడలి సచ్ఛీలతను నిరూపించుకోవటానికి ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే..ఆమె నిప్పుల మీద నడవాలని. ఆ నిప్పుల మీద నడుచుకుంటూ కోడలు వెళ్లగలిగితే ఆమె ఏ తప్పూ చేయలేదని తీర్మానించాడు. అదే కరెక్ట్ అని ఆ ఊరి జనాలు కూడా నమ్మారు. దీంతో ‘అగ్నిపరీక్ష’కు నేనే సిద్ధం అని కోడులు అంగీకరించింది.

అలాగ ఆగస్టు 17 రాత్రి గ్రామస్తుల సమక్షంలో కణకణ మండుతున్న నిప్పుల్ని ఏర్పాటు చేశారు. అత్తాకోడళ్లతో పాటు ఆమె కుటుంబం అంతా అక్కడికి వచ్చింది. బాధితురాలి భర్త కూడా వచ్చాడు. అలా ఆమె కణకణమండే నిప్పులపై నడించింది. తిరిగి మళ్లీ అటు నుంచి ఇటు అలా రెండుసార్లు నడిచింది. భర్త అక్కడే ఉన్నా ఆమెకు ఏమాత్రం అండగా నిలబడలేదు సరికదా..చోద్యం చూస్తు నిలబడ్డాడు. అంటే ఆమెను అతను కూడా అనుమానించినట్లే. ఇలా మొత్తానికి ‘అగ్నిపరీక్షలో కోడలు నెగ్గింది. అప్పుడు అత్త నాకోడలు ఏ తప్పూ చేయలేదు అంటూ అంగీకరించింది. తన కోడలి విషయంలో తానే పొరపాటు పడ్డానని అత్త ఒప్పుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈరోజుల్లో కూడా ఇవేం పరీక్షలంటూ మండిపడుతుంటే మరికొందరు మాత్రం కోడలు ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆమెను పొగిడేస్తున్నారు. కానీ తన భార్యపై నమ్మకం లేనివాడు రేపు మరోసారి ఆమెపై అనుమానం పెంచుకోడని రుజువేంటీ? తన సచ్చీలతను నిరూపించుకున్న ఆమె తిరిగి ఆ భర్తతో గతంలోగా ప్రేమగా ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉండగలదా? ఆమె మనస్సునుంచి ఈ ఘటన చెరిగిపోగలదా? అనేది ఆమెకే తెలియాలి.