ఆడా-మగా ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా..వివాహేతర సంబంధం అనలేం : మద్రాస్ హైకోర్టు తీర్పు

ఆడా-మగా ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా..వివాహేతర సంబంధం అనలేం : మద్రాస్ హైకోర్టు తీర్పు

men and woman locked room not immoral relationship : ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. అది ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇల్లు. దాంట్లో ఇద్దరు ఆడా మగా ఉన్నారు. వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందని వచ్చిన ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో ఈకేసు కోర్టుదాకా వచ్చింది. ఈ కేసు విచారణ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆడా- మగా ఒకే ఇంటిలో ఒకే గదిలో ఉన్నంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని స్పష్టం చేసింది. వారిద్దరి మధ్యా అటువంటి సంబంధం ఉందని చెప్పలేమని స్పష్టం చేసింది.

1998లో కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన క్వార్టర్‌లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని..అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని..వారి మధ్య అక్రమ సంబంధం లేకపోతే తలుపులు వేసుకుని ఉండాల్సిన అవసరమేంటీ? అని ఆరోపిస్తూ..బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిని విధుల నుంచి తొలగించారు. దాంతో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు. ఇది మా ఇద్దరి జీవితాలను సంబంధించినదనీ..మాపై ఇటువంటి ఆరోపణలు చేయటం ఎంత వరకూ సరైనది అంటూ కోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌ సురేష్‌ కుమార్‌ రద్దు పిటిషన్‌ని విరమించుకుంటూ.. ‘‘సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం.. వారిపై అనవసరంగా నిందలు మోపటం సరైందికాదని చెప్పింది. వారిని విధుల నుంచి తొలగించడం సరైనది కాదని సూచించింది.

ఈ కేసులో నిందలు ఆరోపించబడిన శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నారు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని’’ ధర్మాసనం వెల్లడించింది. అంతేకాదు..ఈకేసులో నిందలు మోపబడిన బాధితుడి వాదనతో హై కోర్టు ఏకీభవించింది. సదరు వ్యక్తులిద్దరూ అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హర్షం వ్యక్తంచేసిన శరవణ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో నిందలు మోపబడిన సదరు మహిళా కానిస్టేబుల్‌ నివాసం..నా క్వార్టర్స్‌ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆమె ఇంటి తాళం కోసం నా క్వార్టర్ కు వచ్చింది. ఈ సందర్బంగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో తలుపు లాక్‌ చేశారు. ఆ తర్వాత మేం డోర్లు వేసుకుని ఇంట్లో ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు.

ఇది మర్యాదస్తులు ఉండేచోటు…ఇటువంటి చోట ఇటువంటి అనైతిక పనులు చేయటానికి మీకు సిగ్గులేదా? అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. దీంతో ఏం తప్పూ చేయకపోయినా మేమిద్దరం చాలా బాధపడాల్సి వచ్చింది. ఆమె ఉంతో మానసిక వేదన అనుభవించింది. ఇది కావాలనే మాపై చేసిన కుట్ర అంటూ శరవణ బాబు ఆవేదన వ్యక్తంచేశాడు. మా మానసిక ఆవేదన ను అర్థం చేసుకున్న న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మా నైతికతను ధర్మాసనం నిరూపించిందని అన్నారు.