‘Vande Mataram’ while attending calls: ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనండి: ‘మహా’ మంత్రి ఆదేశాలు

మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. మనం అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని ఆయన అన్నారు.

‘Vande Mataram’ while attending calls: ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనండి: ‘మహా’ మంత్రి ఆదేశాలు

'Vande Mataram' while attending calls

‘Vande Mataram’ while attending calls: మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. మనం అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఫోను ఎత్తగానే ‘వందే మాతరం’ అని పలకాలని, ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆగస్టు 18 లోగా జారీ చేస్తామని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది జనవరి 36 వరకు ప్రభుత్వ అధికారులు అందరూ ఈ ఆదేశాలు పాటించాలని ఆయన అన్నారు. కాగా, భారత్ ఇవాళ 75 ఏళ్ళ స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగరవేస్తారు. ఏడు వేల మంది వీక్షకులు రానున్నారు. అలాగే, 10 వేల మంది పోలీసులతో పలు అంచెల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

China-Taiwan conflict: తైవాన్‌కు మొన్న నాన్సీ ఫెలోసీ.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం