Gufi Pental passed away : శకుని మామ ‘గుఫీ పెంటల్’ ఇక లేరు
బీ.ఆర్.చోప్రా దర్శకత్వంలో ఒకప్పుడు వచ్చిన 'మహా భారత్' సీరియల్‌ను ఎవరూ మర్చిపోలేరు. అందులో నటించిన నటుల్ని మర్చిపోలేరు. అందులో శకుని మామ'గా అద్భుతమైన విలనిజం పండించిన గుఫీ పెంటల్ అనారోగ్య కారణాలతో మరణించారు.

Gufi Pental
Gufi Pental : ప్రముఖ సినీ, టీవీ నటుడు గుఫీ పెంటల్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు 79 సంవత్సరాలు. ప్రసిద్ధి చెందిన సీరియల్ మహా భారత్‌లో శకుని మామగా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Sulochana Latkar : ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్..
ప్రముఖ నటుడు గుఫీ పెంటల్ గురువారం ఉదయం 9 గంటలకు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
గుఫీ పెంటల్ 1975 లో రఫూ చక్కర్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో నీతూ కపూర్, రిషి కపూర్‌లతో కలిసి నటించారు. సుహాగ్, దావా, ఘూమ్, సామ్రాట్ & కో వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ మహాభారతంలో ఆయన నటించిన ‘శకుని మామ’ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. నిజంగా శకుని మామ ఇలాగే ఉంటారేమో అన్నట్లు ఆ పాత్రలో చక్కని విలనిజం ప్రదర్శించారాయన. తరువాత బహదూర్ షా జఫర్, CID, రాధాకృష్ణ వంటి పలు టీవీ షోలలో కనిపించారు.
Bollywood : బాలీవుడ్ లో ఒకేరోజు రెండు విషాదాలు.. ప్రముఖ నటి, నటుడు కన్నుమూత..
గుఫీ పెంటల్ చివరిసారి 2022లో ‘జై కనియా లాల్ కీ’ అనే టీవీ షోలో కనిపించారు. ఆయన ‘శ్రీ చైతన్య మహాప్రభు’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. గుఫీ పెంటల్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ , టీవీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.