రైతు బంధు వద్దు..మీరే తీసుకోండి రైతు ఉదారత

రైతు బంధు వద్దు..మీరే తీసుకోండి రైతు ఉదారత

తనకు వచ్చిన రైతు బంధును వద్దన్నాడు. మీరే తీసుకొండి. గ్రామాభివృద్ధికి ఉపయోగించండి. అంటూ ఓ రైతు తనకున్న ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రైతు బందు పథకానికి సంబంధించిన చెక్కును తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడంతో అందరూ ఆ రైతును మెచ్చుకుంటున్నారు.

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బందు చెక్కులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పంట పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు రైతుల ఖాతాలో నగదు జమ అయ్యింది.

ఇలాగే..మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ కు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బందు డబ్బులు వచ్చాయి. 25.20 ఎకరాల భూమికి పంటపెట్టుబడి సాయంగా రూ.1,25,250లు వచ్చాయి.

అయితే..ఈ డబ్బులను వద్దని అనుకున్నాడు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తన డబ్బులు అందచేయాలని నిర్ణయం తీసుకున్నాడు రవి కుమార్. 2020, జూన్ 25వ తేదీ గురువారం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం జరిగింది.

ఇందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన రూ. 1, 25, 250 రూపాయల చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందచేశారు. అప్పాయిపల్లి గ్రామాభివృద్ధికి ఈ డబ్బులను వాడాలని రవి కుమార్ తెలిపారు.

Read: వాట్సప్ ద్వారా పెళ్లి చేసుకున్న మరుగుజ్జులు