Maharashtra: ప‌త‌నం అంచున మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం?.. కొన్ని గంట‌ల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ

మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన సీనియ‌ర్ నేత ఏక్‌నాథ్ షిండే గుజ‌రాత్‌లోని సూర‌త్ నుంచి ఇవాళ‌ ఉద‌యం అసోంలోని గువాహ‌టికి 40 మంది ఎమ్మెల్యేల‌తో చేరుకున్న విష‌యం తెలిసిందే.

Maharashtra: ప‌త‌నం అంచున మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం?.. కొన్ని గంట‌ల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ

Shivsena Uddav

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన సీనియ‌ర్ నేత ఏక్‌నాథ్ షిండే గుజ‌రాత్‌లోని సూర‌త్ నుంచి ఇవాళ‌ ఉద‌యం అసోంలోని గువాహ‌టికి 40 మంది ఎమ్మెల్యేల‌తో చేరుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఉన్నారు.

presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ‘జ‌డ్’ ప్ల‌స్ భ‌ద్ర‌త‌

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇప్ప‌టికే ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ పత్రాలపై శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అధికారం మారిన తర్వాతే రాష్ట్రానికి తిరిగి వస్తామ‌ని వారు అంటున్నారు.

Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

త‌మ‌లో ఎవరినీ బలవంతంగా అసోంకు తీసుకురాలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి అధికారంలో ఉండడం ఇష్టం లేదని చెప్పారు. శివ సైనికులు, స్వతంత్ర ఎమ్మెల్యేలు అధికారంలో మార్పును కోరుకుంటున్నారని వారు అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో త‌మకు ఎలాంటి గొడవలూ లేవని చెప్పుకొచ్చారు.