నా గుర్రాన్ని కలెక్టర్ ఆఫీసులో కట్టేస్తాను..పర్మిషన్ ఇవ్వండీ: ఉద్యోగి వింత లెటర్

నా గుర్రాన్ని కలెక్టర్ ఆఫీసులో కట్టేస్తాను..పర్మిషన్ ఇవ్వండీ: ఉద్యోగి వింత లెటర్

My horse on collectorate campus  : ఓ ప్రభుత్వం ఉద్యోగి కలెక్టర్ కు రాసి ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెటర్ లో ‘‘కలెక్టర్ సార్..నేను గుర్రంమీద ఆఫీసుకు వస్తాను..ఆఫీసు ప్రాంగణంలోనే నా గుర్రాన్ని కట్టేస్తాను…దీనికోసం నాకు పర్మిషన్ ఇవ్వండీ సార్ అంటూ రాసుకొచ్చాడు. ఆ లెటర్ చదవిని కలెక్టర్ షాక్ అయ్యారు. ఇటీవల కాలంలో ప్రతీరోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సదరు ఉద్యోగి గుర్రంమీద రావాలనుకుంటున్నాడేమోనని మీరు అనుకోవచ్చు..కానీ అసలు విషయం అది కాదు..మరి అసలు విషయం ఏమిటంటే..

మహారాష్ట్రలోని నాందేడ్‌‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి జిల్లా కలెక్టర్‌కు చేసుకున్న విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను రోజు గుర్రం మీద వస్తానని, ఆఫీసు ప్రాంగణంలో గుర్రాన్ని కట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ వ్యక్తి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడు. అతడు అలా అడగడానికి కారణం పెట్రోల్ ధరలు మాత్రం కాదండోయ్. ఇందుకు మరో కారణం ఉంది.

నాందేడ్ జిల్లా కలెక్టరు కార్యాలయంలోని ఉపాధి హామీ పథకం డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ఆడిటర్ గా పనిచేస్తున్న సతీష్ దేశ్‌ముఖ్ కలెక్టర్ కు లేఖ రాస్తూ..దాంట్లో నాకు ఇటీవల వెన్నెముక సమస్య వచ్చింది. దీంతో డాక్టర్ బైక్స్ నడవవద్దని సూచించారు..అది కష్టం కూడాను..అందుకే..నేను గుర్రం కొనాలని నిర్ణయించుకున్నా..ఇకనుంచి ప్రతీరోజూ ఆఫీసుకు గుర్రం మీదే రావాలనుకుంటున్నా. దాన్ని ఆఫీసు ప్రాంగణంలో కట్టటానికి మీరు అనుమతి ఇవ్వగలరు’’ అని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖను పరిశీలించిన రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ ప్రదీప్ కులకర్ణీ షాక్ అయ్యారు. అనంతరం డాక్టర్ సలహాను కోరారు.

నాందేడ్‌‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయిన చావన్ మెడికల్ కాలేజ్ డీన్‌.. డాక్టర్ శంకర్‌రావు ఉద్యోగి సతీష్ వెన్నెముక సమస్య గురించి కలెక్టర్ సలహా అడిగారు. దాన్ని పరిశీలించిన డాక్టర్ శంకర్ రావు..గుర్రం మీద స్వారీ చేయడం వల్ల వెన్నెముక సమస్య మరింత తీవ్రమవుతుందని…కాబట్టి దానికి పర్మిషన్ ఇవ్వకపోవటమే మంచిదని కలెక్టర్‌కు తెలిపారు.

గుర్రం పరిగెట్టేప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి పైకి కిందకీ ఎగిరిపడుతుంటాడనే విషయం తెలిసిందే. దానివల్ల అతని వెన్నెముకపై మరింత ఒత్తిడి పడుతుందని తెలిపారు. అయితే..కలెక్టర్ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే సతీష్.. తన లేఖను వెనక్కి తీసుకున్నాడు. ను చెప్పిన కారణం సరైనది కాదని తాను భావిస్తున్నాననీ..అందుకే లెటర్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నానని తెలిపాడు.