IT Raid In Maharashtra: మహారాష్ట్రలో ఐటీ దాడులు..రూ.100 కోట్ల బినామీ ఆస్తులు స్వాధీనం..డబ్బులు లెక్కించడానికి 13 గంటలు

మహారాష్ట్రలోని జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

IT Raid In Maharashtra: మహారాష్ట్రలో ఐటీ దాడులు..రూ.100 కోట్ల బినామీ ఆస్తులు స్వాధీనం..డబ్బులు లెక్కించడానికి 13 గంటలు

IT conducted a raid at premises of a steel, cloth merchant & real estate developer in Jalna

IT Raid In Maharashtra: మహారాష్ట్రలోని జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

జల్నా ప్రాంతానికి చెందిన స్టీల్‌ కంపెనీ యజమాని కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో రూ. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు, ప్రాపర్టీ పేపర్లతో సహా దాదాపు రూ. 100 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్‌ చేశారు. పట్టుబడిన నగదును లెక్కించేందుకు అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టింది. అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

కాగా దేశ వ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులతో బిజీగా మారాయి. సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా ప్రతి సంస్థ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు, దర్యాప్తులు ముమ్మరం చేశాయి. ఇటీవల టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు ఈడీ గుర్తించింది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.