నగర గోడలపై ట్రాన్స్ జెండర్ల పెయింటింగ్..సూపర్ అంటున్న జనాలు

నగర గోడలపై ట్రాన్స్ జెండర్ల పెయింటింగ్..సూపర్ అంటున్న జనాలు

BMC transgender Paintings సమాజంలో వివక్షలను ఎదుర్కొనే ట్రాన్స్ జెండర్లతో ఉన్న ప్రతిభను బీఎంసీ చక్కగా ఆవిష్కరింపజేస్తోంది. నగర గోడలపై ట్రాన్స్ జెండర్లతో అద్భుతమైన చిత్రాలను వేయిస్తూ..ట్రాన్స్ జెండర్లలో ఉండే కళను ప్రజలకు కనబరుస్తోంది. కళ అనేది ఏ ఒక్కరికో సొంతం కాదని వెల్లడిస్తోంది.

మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైలోని వ‌ర్లిలో బృహ‌ణ్ ముంబై కార్పొరేష‌న్ నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని నిర్ణయించింది. సుందరీక‌ర‌ణ ప‌నులల్లో భాగంగా .. వ‌ర్లిలోని ప‌లు ప్రాంతాల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది. వర్లిలోని గోడ‌ల‌పై అద్భుత‌మైన పెయింటింగ్‌ను వేయిస్తున్నారు. ఇదంతా ట్రాన్స్ జెండర్ల ప్రతిభేనని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. వ‌ర్లి సుంద‌రీక‌ర‌ణ‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను బీఎంసీ భాగ‌స్వామ్యం చేసింది.

వాల్ పెయింటింగ్స్ లతో తమలోని ప్రతిభాపాటవాలను ట్రాన్స్ జెండర్లు ఆవిష్కరిస్తున్నారు. అద్భుతమైన పెయింటింగులు వేస్తున్నారు ట్రాన్స్‌జెండ‌ర్లు. బీఎంసీ పరిధిలోని 80 నుంచి 100 ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు వేసిన పెయింటింగ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బీఎంసీ తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నామని చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ ట్రాన్స్‌జెండ‌ర్ మాట్లాడుతూ.. తాను స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు పెయింటింగ్ వేయటం నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు బీఎంసీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పెయింటింగ్‌లో అద్భుత‌మైన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టులో గ‌త నాలుగైదు సంవ‌త్స‌రాల నుంచి కొనసాగుతున్నానని..తాము వేసిన పెయింటింగ్స్‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని..ఇది మాకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు.

Maharashtra: Members of transgender community paint wall in Worli area of Mumbai

"I wasn't good at drawing in school. I practised & improved my skill. I joined the project 4-5 years ago & have been painting walls at different locations," says a member of the community (24.02) pic.twitter.com/xHRV7CD9eA
— ANI (@ANI) February 24, 2021