Maharashtra: వంద కోట్లకు ఎమ్మెల్యేకు మంత్రి పదవి పేరుతో మోసానికి యత్నం.. నిందితుల అరెస్టు

వంద కోట్లు ఇస్తే మంత్రి పదవి వచ్చేలా చేస్తామంటూ ఎమ్మెల్యేనే బురిడీ కొట్టేందుకు ప్రయత్నించిందో గ్యాంగ్. అయితే, అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చి, నిందితులు అడ్డంగా బుక్కయ్యారు.

Maharashtra: వంద కోట్లకు ఎమ్మెల్యేకు మంత్రి పదవి పేరుతో మోసానికి యత్నం.. నిందితుల అరెస్టు

Maharashtra

Maharashtra: వంద కోట్లు ఇస్తే క్యాబినెట్ మంత్రి పదవి ఇప్పిస్తామంటూ ఎమ్మెల్యేకే బురిడీ కొట్టేందుకు ప్రయత్నించిందో గ్యాంగ్. అయితే, అప్రమత్తమైన ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అక్కడ షిండే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అనంతరం కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు.

Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు, సిద్ధూ మూసేవాలా హంతకులకు మధ్య కాల్పులు

అయితే, వారి పోర్ట్‌ఫోలియోలు మారుతాయని, కొందరికి కొత్తగా మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారు. దౌంద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కుల్‌ను లక్ష్యంగా చేసుకుని మోసానికి ప్రయత్నించారు. రియాజ్ షేక్, యోగేష్ కులకర్ణి, సాగర్ సంఘ్వి, జఫ్ఫార్ ఉస్మాని అనే నలుగురు బృందంగా ఏర్పడ్డారు. ఎమ్మెల్యే పీఏకు కాల్ చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడాలని చెప్పారు. ఒక హోటల్‌లో రాహుల్ కుల్‌తో సమావేశమయ్యారు. రూ.100 కోట్లు ఇస్తే క్యాబినెట్ మంత్రి పదవి ఇప్పిస్తామని చెప్పారు. ఒక రాజకీయ నేత సహకారంతో ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపి చివరకు రూ.90 కోట్లకు ఒప్పించాడు.

Service Charge Row: రెస్టారెంట్లలో సర్వీసు ఛార్జీల రద్దుపై ఢిల్లీ హై కోర్టు స్టే

అయితే, అందులో 20 శాతం అంటే రూ.18 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని సూచించారు. దీనికి అంగీకరించిన ఎమ్మెల్యే డబ్బులు తర్వాత ఇస్తానని, వారిని మళ్లీ రమ్మని చెప్పి పంపాడు. ఈ లోపే అనుమానం వచ్చిన ఎమ్మెల్యే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. అసలు పార్టీలో ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే దగ్గర రూ.18 కోట్లు తీసుకునేందుకు నిందితులు రాగా, వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 26వరకు నిందితుల పోలీసు కస్టడీ కొనసాగనుంది.