చీకటి జీవితాలను వదిలేసి..కొత్త దారిలో అడుగులేస్తున్నారు..వాళ్ల నగలకు భలే గిరాకీ

చీకటి జీవితాలను వదిలేసి..కొత్త దారిలో అడుగులేస్తున్నారు..వాళ్ల నగలకు భలే గిరాకీ

Maharashtra:Sex workers Manufacture of jewellery : కుటుంబాలను పోషించుకోవటానికి చీకటిలో మగ్గిపోతూ..పడుపు వృత్తితో మగ్గిపోతూన్న అభాగ్య మహిళలు వెలుగుదిశగా అడుగులేస్తున్నారు. సెక్స్ వర్కర్లుగా కొనసాగించే జీవితాలను చరమాంకం పలకాలనుకుంటున్నారు. గౌరవమైన జీవితాలను జీవించాలని ఆశపడుతున్నారు. దీంట్లో భాగంగా ఆభరణాలు తయారుచేయటం నేర్చుకుంటున్నారు.

కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ తో సెక్స్ వర్కర్లు తీవ్ర కష్టాల్లో పడిపోయారు. తినటానికి తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్ని భరించారు. లాక్ డౌన్ తరువాత కూడా వారి జీవితాలు ఏమాత్రం మారలేదు. దీంతో ఇక ఈ పడుపు వృత్తి మానివేసి కొత్త జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. స‌రికొత్త ప‌ని నేర్చుకుంటూ తమకంటూ ఓ మంచి జీవితాలనుఏర్పరచుకోవాలని ఆభరణాలు తయారు చేయటం నేర్చుకుని వాటిని అమ్ముతూ కొత్త జీవితాలవైపు అడుగులేస్తున్నారు.

నాసిక్‌లోని సెక్స్ వ‌ర్క‌ర్లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆశా అధికారులు గుర్తించారు. వారికి జీవ‌నోపాధి క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు ఆభ‌ర‌ణాల త‌యారీలో శిక్ష‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు ఆర్థిక సాయం చేసి ఆభ‌ర‌ణాల త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యేలా చేశారు. వారు త‌యారు చేసిన ఆభ‌ర‌ణాలకు మార్కెట్లో మంచి గిరాకీ రావటంతో దాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై ఓ సెక్స్ వ‌ర్క‌ర్లు మాట్లాడుతూ.. మేం త‌యారు చేసిన ఆభ‌రణాల‌కు మంచి డిమాండ్ ఉంద‌నీ.. త‌మ‌ను ప్ర‌జ‌లు కూడా ఆద‌రిస్తున్నార‌ని, ఇది త‌మ భ‌విష్య‌త్‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని సంతోషం వ్యక్తంచేశారు.