Aaditya Thackeray : మహారాష్ట్రలో త్వరలో కరోనా థర్డ్ వేవ్

మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Aaditya Thackeray : మహారాష్ట్రలో త్వరలో కరోనా థర్డ్ వేవ్

Aaditya Thackeray

Maharashtra మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ థర్డ్ వేవ్..సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమని అన్నారు. కోవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పని చేకపోయినా, భవిష్యత్తులో విష్యత్తులో ఇది ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.

కరోనా దృష్ట్యా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ గత ఏడాది ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఆధారంగా తీసుకుంటున్నదని, ఇందులో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని ఆదిత్య ఠాక్రే సృష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల బెడ్స్ ఉన్నాయని, వీటిలో 70 శాతం పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని ఆయన చెప్పారు. ఇటీవలి నెలల్లో వైరస్ మ్యుటేషన్ గా రూపాంతరం చెందింది.. ఈ పరిస్థితుల్లో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సలహాలను, సూచనలను తీసుకోవాలి అని ఆదిత్య థాక్రే సూచించారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వలస కూలీల వలసలు తగ్గినట్టు ఆదిత్య ఠాక్రే తెలిపారు. పరిస్థితి చాలావరకు అదుపులోనే ఉంటుందని భావిస్తున్నామన్నారు. పరిశ్రమలు కూడా లేబర్ ను వారి శ్రమశక్తిని వినియోగించుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో 10 నుంచి 15 రోజుల్లో కోవిడ్ చైన్ ని బ్రేక్ చేస్తామని ఆశిస్తున్నామని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఇక,దేశంలో కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ప్రతి రోజూ 60వేలకు పైగా కేసులు,400కి పైగా మరణాలు నమోదవుతుండటం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.