స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్న సూపర్‌స్టార్

స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్న సూపర్‌స్టార్

Sarileru Neekevvaru: సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై మహేష్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచింది. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇచ్చారు.

థియేటర్లలో కలెక్షన్ల పరంగా స్టామినా చూపించిన సూపర్‌స్టార్ స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పటికి నాలుగుసార్లు టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అన్నిసార్లు టిఆర్పీ పరంగా టాప్‌లో నిలవడం విశేషం.

ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయినప్పుడు 23.4, రెండోసారి 17.4, మూడోసారి 12.55, నాలుగోసారి 10.18 టిఆర్పీ రేటింగ్స్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సత్తా చాటింది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు.