Mahesh Babu Daughter : స్టార్ హీరో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ కూతురు

సినీ పరిశ్రమలో వారసత్వం కొత్తేమి కాదు. హీరోల కొడుకులే కాదు కూతుర్లు కూడా సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. మంచు లక్ష్మి, నిహారిక, మంజుల ఇలా వీళ్లంతా కూడా వారసత్వంతో వచ్చిన వాళ్లే

Mahesh Babu Daughter : స్టార్ హీరో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ కూతురు

Sithara

Mahesh Babu Daughter :  సినీ పరిశ్రమలో వారసత్వం కొత్తేమి కాదు. హీరోల కొడుకులే కాదు కూతుర్లు కూడా సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. మంచు లక్ష్మి, నిహారిక, మంజుల ఇలా వీళ్లంతా కూడా వారసత్వంతో వచ్చిన వాళ్లే. కొంతమంది హీరోల కొడుకులు, కూతుర్లు చిన్నప్పుడే బాల నటులుగా ఎంట్రీ ఇస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఒకప్పుడు బాల నటులే. ఇప్పుడు ఈ స్టార్ హీరోల వారసులు కూడా బాల నటులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో అర్హ వెండితెరపై కనిపించనుంది.

తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ తనయ సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకి చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. డైరెక్టర్ వంశీ కూతురు ఆద్యతో కలిసి సితార యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తుంది. కొన్ని రామోషన్స్ లో కూడా పాల్గొంటుంది. ఇప్పటికే యాక్టింగ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే మహేష్ బాబు వంశీలు కూడా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే.

MAA Elections : అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. 17 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్ అవ్వుద్దా??

ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. అందుకే కూతరు క్యారెక్టర్ కి సితారని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ చెప్పిన కాన్సెప్ట్ మహేష్ కి కూడా నచ్చటంతో మహేష్ బాబు తన కుమార్తెను తన స్నేహితుడు వంశీ సినిమా ద్వారా లాంచ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలో స్టార్ హీరో విజయ్ కు కూతురిగా సితార వెండితెర పై కనిపించనుంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.