Iodine : ఉప్పులో అయోడిన్ ఉందో లేదో చిటికెలో నిర్ధారించండి

అయితే మార్కెట్లలో వచ్చే బ్రాండ్ల ఉప్పులో అయోడిన్ చేర్చాలని ప్రభుత్వం నేషనల్ అయోడిన్ డెఫిసియన్సీ డిజార్డర్స్ కంట్రోలో ప్రోగ్రాంను చేపట్టింది. ఉప్పులో అయోడిన్ 30పీపీఎమ్ కంటే తక్కువ ఉ

Iodine : ఉప్పులో అయోడిన్ ఉందో లేదో చిటికెలో నిర్ధారించండి

Befunky Photo (1)

Iodine : భారతీయుల వంటకాల్లో ఉప్పు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఉప్పులేకుండా ముద్దదిగని పరిస్ధితి. వంటకాలకు తగినంత ఉప్పు జోడిస్తే మంచి రుచి వస్తుంది. ఉప్పులో అత్యధిక శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఆహార పదార్ధాలు ఎక్కవకాలం నిల్వ ఉండేందుకు ఉప్పును ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పచ్చళ్ళు వంటి వాటిని నిల్వ ఉంచేందుకు ఉప్పును ఎక్కవ మోతాదులో వాడుతారు. జాతీయ పోషకాహార సంస్ధ సిఫార్సు ప్రకారం రోజుకు 6గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు.

ఇక అసలు విషయానికి వస్తే మనిషి శరీరంలోని మెదడు, ఇతర అవయవాల పనితీరు మెరుగుపరిచేందుకు అయోడిన్ ఉపయోగపడుతుంది. శరీరానికి తగినంత మోతాదులో అయోడిన్ అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయోడిన్ లోపాన్ని నివారించేందుకు ఇటీవలికాలంలో అనేక కంపెనీలు అయోడైజ్డ్ ఉప్పును తయారు చేస్తూ మార్కెట్లోకి ఆకర్షణీయమైన బ్రాండ్లలో అందుబాటులోకి తెస్తున్నాయి.

అయితే మార్కెట్లలో వచ్చే బ్రాండ్ల ఉప్పులో అయోడిన్ చేర్చాలని ప్రభుత్వం నేషనల్ అయోడిన్ డెఫిసియన్సీ డిజార్డర్స్ కంట్రోలో ప్రోగ్రాంను చేపట్టింది. ఉప్పులో అయోడిన్ 30పీపీఎమ్ కంటే తక్కువ ఉండకూడదని ఆహార కల్తీ చట్టం స్పష్టం చేస్తుంది. వినియోగదారుల స్ధాయిలో ఈ పరిమాణం 15పీపీఎమ్ కంటే తక్కువగా ఉండకూడదు. ఈ క్రమంలో ఉప్పు తయారీ కంపెనీలు అయోడైజ్డ్ ఉప్పు తయరీలో తగిన ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవటం చాలా సులభం.

ఇందుకు చేయాల్సిందల్లా ఓ బంగాళ దుంపను తీసుకుని దానిని మధ్యకు కోసి రెండు భాగాలుగా చేయాలి. దానిపై కత్తిరించిన భాగంలో ఉప్పు చల్లి ఒక నిమిషం తరువాత ఉప్పు చల్లిన ప్రాంతంలో నిమ్మరసం రెండు చుక్కలు వేయాలి. కొద్ది సేపు గమనిస్తే బంగాళ దుంప రంగు మారకుంటే అయోడైజ్డ్ సాల్ట్ గా, రంగు మారి నీలం రంగుకు వస్తే కల్తీ అయోడైజ్డ్ సాల్ట్ గా గుర్తించాలి.

ఇటీవలికాలంలో చాలా కంపెనీలు కల్తీ అయోడైజ్డ్ ఉప్పును అయోడైజ్డ్ ఉప్పుగా ప్రకటనలు గుప్పించి మార్కెట్లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. ఆ సంస్ధ ఇప్పటికే ఓ వీడియోను ప్రజలకు అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియాలో షేర్ చేసింది.