‘రాధే శ్యామ్’ రెడీ అవుతున్నారు..

‘రాధే శ్యామ్’ రెడీ అవుతున్నారు..

Darling Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం.. ‘రాధే శ్యామ్’..

70 కాలంలో రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుపుతూ.. ప్రీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది..

Radhe Shyam

శుక్రవారం ఈ నెల 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ‘గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్టు టీమ్ వెల్లడించింది. ఈ విషయం తెలియజేస్తూ వదిలిన పోస్టర్ అదిరిపోయింది. జేబులో చేతులు పెట్టుకొని స్టైల్‌గా నడుస్తున్న ప్రభాస్ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత మందిస్తుండగా.. హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనున్నారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సాంగ్స్, ఆర్ఆర్ కంపోజ్ చెయ్యనున్నారు ఈ సంగీత ద్వయం.

Radhe Shyam