Malaika Arora danda yoga : కర్రతో మలైకా అరోరా కసరత్తులు..బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ కోసం‘దండ యోగా’..

బాలీవుడ్‌ భామ మలైకా అరోరా అంటే ఠక్కున గుర్తుకొచ్చే పాట దిల్ సే సినిమాలో ఛల్‌..ఛయ్యా..ఛయ్యా…అలాగే మున్నీ బద్నామ్. 50 దగ్గరపడినా ఈ భామలో అందం ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోయిన్లను కూడా ఛాలెంజ్ చేసే అందం మలైకా సొంతం అంటే అతిశయోక్తి కాదు. అందంతో పాటు ఫిట్ నెస్ కూడా ఇంపార్టెంట్ అనే మలైనా ‘దండ యోగా’తో మరోసారి ఇన్ స్టాలో హల్ చల్ చేస్తోంది.

Malaika Arora danda yoga : కర్రతో మలైకా అరోరా కసరత్తులు..బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ కోసం‘దండ యోగా’..

Malaika Arora danda yoga : బాలీవుడ్‌ భామ మలైకా అరోరా అంటే ఠక్కున గుర్తుకొచ్చే పాట దిల్ సే సినిమాలో ఛల్‌..ఛయ్యా..ఛయ్యా…అలాగే మున్నీ బద్నామ్. 50 దగ్గరపడినా ఈ భామలో అందం ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోయిన్లను కూడా ఛాలెంజ్ చేసే అందం మలైకా సొంతం అంటే అతిశయోక్తి కాదు. అందంతో పాటు ఫిట్ నెస్ కూడా ఇంపార్టెంట్ అనే మలైనా ‘దండ యోగా’తో మరోసారి ఇన్ స్టాలో హల్ చల్ చేస్తోంది.

అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్న మలైకా అరోరా దండ యోగాతో మైమరపిస్తోంది. ఫిట్ నెస్ కు ఇంపార్టెంట్ ఇవ్వటంలో మలైకా ది బెస్ట్ అనే చెప్పాలి. మలైకా ఫిట్‌గా ఉండటానికి యోగా చేస్తుంది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఆమె భంగిమలను షేర్ చేస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో కష్టమైన యోగా భంగిమలు చేస్తూ ఫిట్ నెస్ చాలా ముఖ్యం అని చెప్పకనే చెబుతుంటుంది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో డిఫరెంట్ యోగా చేస్తూ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మలైకా “అద్భుతమైన మండే వర్కౌట్” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. ఈ వ్యాయామంలో ఆమె వెదురు కర్రతో యోగా(దండ యోగ) చేస్తూ కనిపించింది. 49 ఏళ్ల బీ టౌన్ బ్యూటీ యోగా చేస్తూ ఎంత ఫిట్‌ గా ఉన్నదో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఫిట్ నెస్ పట్ల అవగాహన కలిగేలా చేస్తోంది. మలైకా అరోరా లాగా బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కాల్చడానికి దండ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ యోగా బెల్లీ ఫ్యాట్‌ని ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం.

దండ యోగా చేయడం వల్ల ప్రయోజనాలు..
దండయోగాతో నడుము చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేందుకు ఇది చక్కటి వ్యాయామం.
ఇలా చేయడం వల్ల చేతులు, కాళ్లు, వెన్నెముక కండరాలు ఎక్కువగా సాగుతాయి.
ఇలా చేయడం వల్ల శరీరం పూర్తిగా రిలాక్స్‌ అవుతుంది..
దండయోగ నిపుణులు చెప్పిటినట్లుగా.. శ్వాస ప్రక్రియను దండ యోగా నియంత్రిస్తుంది.
ఈ ఆసనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి..
గమనిక : ఎటువంటి ఆసనాలు అయినా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి..లేదంటే ఇబ్బందులు కలుగుతాయనే విషయం మర్చిపోవద్దు..

 

View this post on Instagram

 

A post shared by Sarva – Yoga Studios (@sarvayogastudios)