Actress Sanusha: బాడీ షేమింగ్‌పై క్లాస్ పీకిన మలయాళ నటి!

బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో ఇది ఎదుర్కొని నటీమణులు లేరంటే అతిశయోక్తి లేదేమో. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరోయిన్స్ అలా అయిపోయారు.. ఇలా అయిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. మన జేజెమ్మ అనుష్క నుండి శృతిహాసన్ వరకు..

Actress Sanusha: బాడీ షేమింగ్‌పై క్లాస్ పీకిన మలయాళ నటి!

Actress Sanusha

Actress Sanusha: బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో ఇది ఎదుర్కొని నటీమణులు లేరంటే అతిశయోక్తి లేదేమో. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరోయిన్స్ అలా అయిపోయారు.. ఇలా అయిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. మన జేజెమ్మ అనుష్క నుండి శృతిహాసన్ వరకు.. సమీరారెడ్డి నుండి అనన్యపాండే వరకు అందరికీ బాడీ షేమింగ్ తప్పలేదు. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ పెరగడంతో ఈ ట్రోలింగ్ కూడా పెరిగింది.

దీనిపై కొందరు హీరోయిన్స్ ధైర్యంగా ఎదుర్కోగా మరికొందరు అసలు వీటిని పట్టించుకోవడం మానేశారు. తాజాగా మలయాళ నటి సానూష అయితే తనపై బాడీ షేమింగ్ ట్రోల్ చేసిన వారికి క్లాస్ పీకి విరుచుకుపడింది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే సానూషా తన అందం గురించి నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోటోను ఇన్ స్టాలో పంచుకున్న సానూష తన అందంపై ట్రోల్స్ చేసిన వారిపై విరుచుకుపడింది.

సానూష బరువు పెరిగిపోయిందని చాలా మంది తెగ బాధపడిపోతున్నారని.. అయితే అలాంటి వారంతా తమను తాము మానసికంగా శారీరకంగా మెరుగయ్యేలా చూసుకోవాలని సానూష కోరారు. తన బరువు గురించి బాధపడిపోతున్న వారందరూ ముందు మీరు బరువు తగ్గి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అన్న సానుషా ఒకరిపై రెండు వేళ్లు చూపించినప్పుడు మన వైపు మూడు వేళ్లు చూపిస్తుంటాయన్నది గుర్తుంచుకోవాలని.. మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.