Mamata Benerjee : తన అడ్డా నుంచే దీదీ పోటీ… బెంగాల్‌లో మోగిన నగారా

ఇది ఆమెకు కంచుకోట లాంటి స్థానం. గతంలో రెండుసార్లు ఇక్కడినుంచే పోటీ చేశారు.

Mamata Benerjee : తన అడ్డా నుంచే దీదీ పోటీ… బెంగాల్‌లో మోగిన నగారా

Mamatha Benerjee

Mamata Benerjee : వెస్ట్ బంగాల్‌లో రాజకీయం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతోంది. బెంగాల్ లోని 3 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ షెడ్యూల్ రిలీజైంది. సీఎం మమత బెనర్జీ భవానీపూర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతుండటంతో… మరోసారి దేశమంతటా బెంగాల్ రాజకీయం చర్చనీయాంశమవుతోంది.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. మమత బెనర్జీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టి… మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు మమత బెనర్జీ. ఐతే.. ఈ సెగ్మెంట్ లో బీజేపీ కీలక అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఐనప్పటికీ… ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. సీఎం పగ్గాలు చేపట్టిన మమత బెనర్జీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.

Read This : By-Polls : ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. హుజురాబాద్ బైపోల్ లేటయ్యేనా..?

బెంగాల్ లోని భవానీపూర్ సెగ్మెంట్ నుంచి ఈసారి బరిలో దిగుతున్నారు మమత బెనర్జీ. ఇది ఆమెకు కంచుకోట లాంటి స్థానం. గతంలో రెండుసార్లు ఇక్కడినుంచే పోటీ చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచి టీఎంసీ నాయకుడు సోభాందేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేసి గెలిచారు. ఆయన రాజీనామా చేయడంతో… ఇక్కడినుంచి మమత బెనర్జీ బరిలోకి దిగుతున్నారు.

బెంగాల్ లో భవానీపూర్,శంషేర్ గంజ్,జంగీపూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఈ మూడు స్థానాలతో పాటు… ఒడిశాలో పిప్లి అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు రానున్నాయి.

Read This : Huzurabad : అక్టోబర్ – నవంబర్ లోనే హుజూరాబాద్ బైపోల్!