Mamata Banerjee: కేంద్ర నిధుల కోసం ప్రధానికి మమత లేఖ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Mamata Banerjee: కేంద్ర నిధుల కోసం ప్రధానికి మమత లేఖ

Mamata Banerjee

Mamata Banerjee: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు. నిధుల విడుదలలో జోక్యం చేసుకోవాలని ఆమె ప్రధానిని కోరారు. నాలుగు నెలలుగా నిధులు విడుదల చేయడం లేదని మమత గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘రెండు పథకాల కింద కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు నిధులు విడుదల చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

 

మొత్తం 6,500 కోట్ల రూపాయల నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస యోజన వంటి పథకాల అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, నిధులు త్వరగా విడుదలయ్యేలా ప్రధాని చొరవ తీసుకోవాలి. 2016-17లో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఈ పథకం కింద 32 లక్షల ఇండ్లు నిర్మించాం’’ అని ప్రధానికి రాసిన లేఖలో మమత వివరించారు.