Very Funny : ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్లు ఎత్తుకుపోయిన దొంగ

ఓ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం కహానీ బయటపడింది. లాండ్రీవాళ్లకు ఇచ్చిన తన ప్యాంటీస్, బనియన్ల దొంగతనం జరిగిందని ఓ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

Very Funny : ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్లు ఎత్తుకుపోయిన దొంగ

Under Wear Theft

Very Funny : దొంగ ఎవరైనా… బంగారం.. ఎత్తుకుపోతాడు లేదా.. డబ్బులు ఎత్తుకుపోతాడు. బండ్లు, బైకులు, టీవీలు… వస్తువులను దొంగిలించుకుపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. విన్నాం.. కానీ.. ఇది అలాంటిలాంటి సంఘటన కాదు. తెల్సుకున్నకొద్దీ వీడెవడండీ బాబూ అనుకోవడం ఖాయం.

ఆడవాళ్ల అండర్ వేర్లను ఎత్తుకుపోయాడు ఓ దొంగ. ఒకటీ రెండూ కాదు… ఏకంగా 730 జతలు. వాటన్నింటినీ… ఒక దగ్గర పెట్టి.. ప్రెజెంటేషన్ పెట్టారు పోలీసులు. డ్రాయర్లు, బ్రా ఐటమ్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టి.. ఇవీ దొంగ ఎత్తుకుపోయిన వస్తువులు అని మీడియాకు చూపించారు.

ఈ లేడీస్ ఇన్నర్ వేర్ లో… కొత్తవీ ఉన్నాయి. పాతవీ ఉన్నాయి. పాతవన్నీ ఓ సైడ్… కొత్తవన్నీ మరోసైడ్ పెట్టారు పోలీసులు.

56 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడే ఎందుకున్నాడు అనే డౌట్ రావొచ్చు. ఎందుకంటే… అతడే అండర్ వేర్లు కొట్టేసిన దొంగ కాబట్టి.

Leena Maria : మత్తుకళ్లతో మోసం, రూ. 200 కోట్ల భారీ మోసం..బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ అరెస్టు

ఈ సంఘటన దక్షిణ జపాన్ లోని బెప్పులో జరిగింది. ఓ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం కహానీ బయటపడింది. లాండ్రీవాళ్లకు ఇచ్చిన తన ప్యాంటీస్, బనియన్ల దొంగతనం జరిగిందని ఓ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఓ వ్యక్తిపై అనుమానం ఉందని.. అతడి వివరాలు కూడా ఇచ్చింది.

అంతే.. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆమె ప్యాంటీ, బనియన్ ను కనిపెట్టారు. బోనస్ గా… వాడి బ్యాక్ గ్రౌండ్ థెఫ్ట్ హిస్టరీ కూడా తెల్సుకుని.. షాకుల మీద షాకులు తిన్నారు.

ఈ దొంగ పేరు టెట్సువో ఉరాటా. ఇతనికి అమ్మాయిల బ్రాలు, కట్ డ్రాయర్లు దొంగిలించే పిచ్చి ఉందట. కొన్నేళ్లుగా… అమ్మాయిలకు సంబంధించిన ఇన్నర్ వేర్ ను దొంగిలిస్తూ తన ఇంట్లో దాచుకుంటున్నాడట. దొంగ చెప్పిన వివరాలతో.. అతడి ఇంట్లో వెతికితే.. డబ్బాలకు డబ్బాలు… ప్యాంటీలు బయటపడ్డాయట. ఇతన్ని జైల్లో పెట్టడం సరికాదని పోలీసులు డిసైడయ్యారట. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నాడని అర్థం చేసుకున్న పోలీసులు… సైకలాజికల్ ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారట.

Under Wear Theft

Under Wear Theft