యూపీ పోలీసులను చంపిన వ్యక్తి వెనుక ఉంది ఎవరు.. 60 మర్డర్ కేసుల్లో నిందితుడు?

యూపీ పోలీసులను చంపిన వ్యక్తి వెనుక ఉంది ఎవరు.. 60 మర్డర్ కేసుల్లో నిందితుడు?

ఎనిమిది మంది పోలీసులు.. అందులో ఓ సర్కిల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంతా షాట్ డెడ్. మిగిలిన ఆరుగురు పోలీసులు చావు దెబ్బలు తిని బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వికాస్ దుబే ఎవరు?
హత్య, దోపిడీలు, కిడ్నాప్ కేసులు వికాస్ దుబే పేరిట నమోదయ్యాయి. అయినా కుటుంబ సభ్యులు అలాంటిదేం లేదని అతను రెండ్రోజులుగా ఇంటికి రాలేదని చెప్తున్నారు. ఓ స్థానికుడి ద్వారా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల నమోదైన మర్డర్ కేసుతో వివరాలు ఒక్కొక్కటి బయటికి వచ్చాయి. 2001 అక్టోబరులో సీనియర్ బీజేపీ లీడర్.. కాంట్రాక్ట్ లేబర్ బోర్డ్ చైర్మన్ సంతోష్ శుక్లా షాట్ డెడ్ అయిపోయాడు. శివ్లీ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు నమోదైంది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. అయినా సాక్ష్యాలు లేవని కోర్టు కేసు కొట్టేసింది.

2001 అక్టోబరున బీజేపీ సీనియర్ లీడర్, కాంట్రాక్ట్ లేబర్ బోర్డ్ చైర్మన్ సంతోష్ శుక్లా శివ్లీ పోలీస్ స్టేషన్ లోపల మర్డర్ అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. అంతేకాకుండా కాన్పూర్ లోని తారాచంద్ ఇంటర్ కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ మర్డర్ కేసులోనూ నిందితుడే.

గతంలో బహజన్ సమాజ్ పార్టీలోనూ పనిచేశాడు. జైల్లో ఉండే నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఇతణ్ని చంపితే రూ.25వేల రివార్డు కూడా ఉండేది.

వికాస్ దూబే కుటుంబం ఏమంటుంది:
వికాస్ దూబే కుటుంబం అసలు అతను రెండ్రోజులుగా ఇంటికి రావడం లేదని చెప్తోంది. మరదలు వరసయ్యే మహిళ ఇలా చెప్పింది. మరి కొందరు బంధువులు అతణ్ని గుర్తుపట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. స్థానికులు ఆ ఘటన జరిగినప్పుడు తాము టైర్ బరస్ట్ అయిందనుకున్నామని.. అంటుంటే మరి కొందరు పొలాల్లో నిద్రపోతున్నామని తెల్లవారిన తర్వాత విషయం తెలిసిందని అంటున్నారు.

కొందరు గ్రామస్థులు వికాస్ ను గ్రామంలోనే చూడలేదని చెప్తున్నారు. నిజానికి దూబే పేరిట ఆ ఊళ్లో అరడజను ఆస్తులు ఉన్నాయట.

Read:రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లి.. కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి