Real King : పక్షుల్ని కొన్నాడు.. ఆ తరువాత వాటిని ఏం చేశాడంటే?

కారులో ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి ఓ పక్షి వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర ఉన్న పక్షులన్నీ కొనేశాడు. ఆ తరువాత ఏం చేశాడు? చదవండి.

Real King : పక్షుల్ని కొన్నాడు.. ఆ తరువాత వాటిని ఏం చేశాడంటే?

Real King

Real King :  చాలామందికి పక్షుల్ని కొనడం, పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ వాటిని పంజరంలో బందీలుగా చూడటానికి కొందరు ఇష్టపడరు. ఓ పక్షులు అమ్మే వ్యక్తి నుంచి వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేశాడో చూస్తే అతని గొప్ప మనసుకి ఫిదా అవుతారు.

Tollywood : సినిమాల్లో హీరోలను డామినేట్ చేస్తున్న జంవుతులు, పక్షులు..

సాధారణంగా పక్షులు అంటే అందరూ ఇష్టపడతారు. వాటిని ఇంట్లో పంజరాల్లో పెట్టి పెంచుతూ ఉంటారు. నిజానికి పక్షుల్ని పెంచడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతారు. అసలు పక్షుల్ని అలా బంధించి ఉంచకూడదని.. అలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయని కొందరు విశ్వసిస్తారు. కొందరు పక్షులు పీల్చి వదిలిన గాలి మనుష్యులు పీల్చడం ద్వారా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని కూడా చెబుతారు. ఏది ఏమైనా పక్షి ప్రేమికులు మాత్రం వాటిని ఇష్టపడుతూనే ఉంటారు. తాజాగా రోడ్డుపై ఉన్న పక్షి వ్యాపారి వెళ్తున్నాడు. కారులో కూర్చున్న ఓ వ్యక్తి వ్యాపారి నుంచి పక్షులను కొని గాలిలోకి విడిచిపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘రియల్ కింగ్’ అంటూ నెటిజన్లు అతని మంచి మనసుని మెచ్చుకుంటున్నారు.

Climate Change : చేపలను వేటాడలేకపోతున్న సముద్ర పక్షులు..ఇది ప్రమాదకరమే అంటున్న పరిశోధకులు..

ఇలాంటి వ్యక్తులు ప్రపంచానికి కావాలని కొందరు.. ఆ వ్యక్తి సాధువుల కనిపిస్తున్నాడని..పక్షులకు స్వేచ్ఛ ప్రసాదించిన గొప్ప వ్యక్తి అని మరికొందరు అతడిని కొనియాడారు. సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు చేసే మంచి పనులు కూడా ఇలా అందర్నీ ఇన్ స్పైర్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.