Man Dies While Dancing : షాకింగ్.. పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.

Man Dies While Dancing : షాకింగ్.. పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

Man Dies While Dancing : చిన్నా పెద్ద తేడా లేదు. వయసుతో సంబంధమే లేదు. కొంతకాలంగా యాజ్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించే వారి సంఖ్య పెరిగింది. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ.. అకస్మాత్తుగా మరణించాడు. ఈ విషాద ఘటన రాజస్తాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శుక్రవారం రాత్రి పాలి నగరంలోని మహాత్మా గాంధీ కాలనీలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలిలోని రణవాస్ స్టేషన్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ సలీం పఠాన్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్దుల్ తన భార్య, ఇద్దరు పిల్లలు తన అత్తమామలతో కలిసి మేనకోడలి వివాహ వేడెక్కి హాజరయ్యాడు. శనివారం అబ్దుల్ మేనకోడలి వివాహం జరగాల్సి ఉంది.

పెళ్లికి ఒక రోజు ముందు.. అబ్దుల్ మ్యూజిక్ నైట్ వేదికపై డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కొన్ని క్షణాల్లో మరణించాడు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అప్పటి వరకు అందరితో కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సడన్ గా కుప్పకూలడం చూసి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అబ్దుల్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అతనితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేదికపై డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి సందడితో చుట్టూ ఆనంద వాతావరణం నెలకొంది. బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా అబ్దుల్ ఒక్కసారిగా కిందపడి మృతి చెందాడు.

డ్యాన్స్ చేస్తూ అబ్దుల్ కుప్పకూలడంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. బంధువులు అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించినా అతని శరీరంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

 

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి