Kerala : కూతురిపై ప్రేమతో.. బీరు తాగించాడు, తర్వాత

ఓ తండ్రి చేసిన నిర్వాకం..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఓ తండ్రి ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ తండ్రి ఏమి చేసి ఉంటాడా అనేగా మీ డౌట్. తన కూతురిపై ప్రేమతో బీర్ తాగించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Kerala : కూతురిపై ప్రేమతో.. బీరు తాగించాడు, తర్వాత

Beer

Man Feeds Daughter Beer : కూతుళ్లు, కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. వారు అడిగినవి నో చెప్పకుండా తెచ్చిపెడుతుంటారు. ఇవన్నీ ప్రేమతో చేస్తుంటారు. బిస్కట్లు, చాక్లెట్లు, ఇతరత్రా వస్తువులు ప్రేమతో కొనిపిస్తుంటారు. కానీ ఓ తండ్రి చేసిన నిర్వాకం..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఓ తండ్రి ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ తండ్రి ఏమి చేసి ఉంటాడా అనేగా మీ డౌట్. తన కూతురిపై ప్రేమతో బీర్ తాగించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కేరళ రాష్ట్రంలోని..కాసర్ గోడ్ జిల్లాలోని హోస్ దుర్గ్ లో తోయమ్మాల్ గ్రామంలో రాధాకృష్ణన్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇతనికి ఎనిమిదేండ్ల కూతురు ఉంది. బీరు తాగుతున్నాడు. కూతురికి కూడా ప్రేమతో తాగించాడు. దీంతో ఆ బాలిక స్పృహ తప్పిపడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి..వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు బాలిక వాంగ్మూలం తీసుకుని..కేసు నమోదు చేశారు. అనంతరం తండ్రి రాధాకృష్ణ‌న్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులతో హాజరుపరచగా..అత‌నికి రెండు వారాల‌ జైలుశిక్ష విధించింది.