Funny incident : ఫోన్ చూస్తూ సర్వం మర్చిపోతే ఇలాగే… ఉంటుంది

సెల్ ఫోన్ వాడకం పెరిగాక మనుష్యులకు మనుష్యులకు మధ్య అనుబంధాలు తగ్గిపోయాయి. చేతిలో సెల్ ఉంటే చాలు పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోవట్లేదు.. ఇక సెల్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు.

Funny incident went viral : చేతిలో మొబైల్ ఉంటే చాలు జనం అన్నీ మర్చిపోతున్నారు.. నూడుల్స్ తింటూ ఓ వ్యక్తి ఫోన్‌లో ఎంతగా మునిగిపోయాడంటే? నవ్వు పుట్టించే సంఘటన వైరల్ అవుతోంది.

Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

పక్కన ఎవరైనా ఉన్నా.. అందరిలో ఉన్నా.. ఇప్పుడు ఎవరి ప్రపంచం వారిదే. సెల్ ఫోన్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సర్వం మర్చిపోతున్నారు. ఓ వ్యక్తి నూడుల్స్ తింటూ సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియకపోగా.. చాలా నవ్వు పుట్టించే పని చేశాడు. కరోనా పుణ్యమా అని ఇప్పటికీ మాస్క్‌ల అలవాటు నుంచి బయటకు రాలేకపోతున్నాం. కొన్ని చోట్ల మాస్క్‌లు కంపల్సరీ అనే నిబంధనలు సడలించినా కొందరు వాడుతూ ఉన్నారు.

 

అయితే నూడుల్స్ తింటున్న వ్యక్తి మూతికి మాస్క్ తొలగించకుండా ఫోన్‌లో లీనమై నూడుల్స్ తినడానికి ప్రయత్నం చేసాడు. నూడుల్స్ మాస్క్‌కి అంటుకోవడంతో అప్పుడు అతను మాస్క్ తీయలేదని గ్రహించాడు. ఈ సీన్ చూసినవారికి నవ్వు పుట్టించింది. Out of Context Human Race అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైన ఈ వీడియో వైరల్ అవుతోంది.

IPL 2023: స్టేడియంలో ప్రేక్షకులను కాపాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

కోవిడ్ టైంలో ఇలా మేము కూడా చాలాసార్లు చేశామంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మామూలుగానే ఫోన్లలో పడితే జనాలు ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం? అనే విషయాలనే పట్టించుకోవట్లేదు. ఇక మూతికి మాస్క్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయేంతగా ఫోన్‌లో లీనమైపోవడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు