MCD polls 2022: ఓటు వేయడానికి వెళ్తే.. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు’ అని చెప్పి వెనక్కి పంపిన అధికారులు

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు కార్డు పట్టుకుని వెళ్లాడో  వ్యక్తి. అయితే, పోలింగ్ కేంద్రం వద్ద అతడికి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు అని మా రికార్డుల్లో ఉంది’ అని ఆ ఓటరుకు అధికారులు చెప్పారు. దీంతో అతడు ఓటు వేయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది.

MCD polls 2022: ఓటు వేయడానికి వెళ్తే.. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు’ అని చెప్పి వెనక్కి పంపిన అధికారులు

MCD polls 2022

MCD polls 2022: మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు కార్డు పట్టుకుని వెళ్లాడో  వ్యక్తి. అయితే, పోలింగ్ కేంద్రం వద్ద అతడికి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు అని మా రికార్డుల్లో ఉంది’ అని ఆ ఓటరుకు అధికారులు చెప్పారు. దీంతో అతడు ఓటు వేయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది.

తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి సదరు ఓటరు జైపాల్ మీడియాతో మాట్లాడాడు.‘‘పోలింగ్ అధికారుల వద్ద ఉన్న డేటాలో తప్పుడు సమాచారం ఉందనుకుని నేను రెండు సార్లు అక్కడకు వెళ్లి వారికి వివరాలు చెప్పాను. నాకు సంబంధించిన అన్ని పత్రాలు నా వద్ద ఉన్నాయి. నేను చనిపోయానని, తమ వద్ద ఉన్న పత్రాల్లో ఇలాగే ఉందని అధికారులు చెప్పారు. నా సోదరుడు ఎనిమిది నెలల ముందు చనిపోయాడు. అసలు అతడి పేరు ఓటరు లిస్టులో లేదని కూడా చెప్పాను. అధికారులు పొరపాటున నేను చనిపోయానని అనుకున్నారేమోనని భావించాను. అయితే, నేనే చనిపోయినట్లు అధికారుల వద్ద డేటా ఉంది’’ అని జైపాల్ తెలిపాడు.

Viral Video: ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ రెచ్చగొట్టిన యువకుడు

మరోవైపు, ఇదే ఎన్నికల్లో మరో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముఖర్జీ అనే వ్యక్తి తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. అయినప్పటికీ, ఓటరు జాబితాలో ఆయన పేరు కొన్నేళ్లుగా ఉంది. ఓటరు జాబితా నుంచి తన తండ్రి పేరు తొలగించాలని ముఖర్జీ గత ఏడాది దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయినప్పటికీ తన తండ్రి పేరు అలాగే, ఓటరు జాబితాలో ఉందని ముఖర్జీ తెలిపాడు. బతికున్న జైపాల్ చనిపోయినట్లు, చనిపోయిన వ్యక్తి (ముఖర్జీ తండ్రి) బతికి ఉన్నట్లు ఓటరు జాబితాను రూపొందించిన అధికారులపై విమర్శలు వస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..