జస్ట్ రూ.5 గమ్‌తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం

జస్ట్ రూ.5 గమ్‌తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం

Man In UP Learns Fingerprint Cloning: ఇదంతా టెక్నాలజీ యుగం. సాంకేతికత బాగా పెరిగింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి పని నిమిషాల్లో జరిగిపోతోంది. టెక్నాలజీ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. పనులు చాలా ఈజీ అయ్యాయి. అయితే, అదే టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోందని సంతోషపడాలో దుర్వినియోగం అవుతోందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.

cloning

జస్ట్ 5 రూపాయల ఖర్చుతో 500 మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్:
ఉత్తరప్రదేశ్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ కేటుగాడు పాల్పడిన మోసం తెలిసి పోలీసులే విస్తుపోయారు. టెక్నాలజీ సాయంతో అతడు చేసిన చీటింగ్ తెలుసుకుని వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. జస్ట్ 5 రూపాయల ఖర్చుతో ఆ వ్యక్తి 500 మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేశాడు.

3.2 billion accounts hack

ప్రభుత్వ పథకాల లబ్దిదారులే టార్గెట్:
ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్ యోజన, వృద్ధాప్య పించన్లకు చెందిన వందలాది మంది లబ్దిదారులను మోసం చేశాడు. వారికి తెలియకుండా వారి ఖాతాల్లోని నగదు కాజేశాడు. తమ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మాయమవుతోందని లబ్దిదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు పడుతోంది, ఆ వెంటనే ఆ మొత్తం విత్ డ్రా అయిపోతోంది. బ్యాంక్ మిత్రాస్ ఆధ్వర్యంలో నడిచే జన్ సువిధ కేందాల ద్వారా నగదు విత్ డ్రా అవుతున్నట్టు గుర్తించారు.

us national nuclear security administration hack

ఇంటర్నెట్ లో చూసి ఫింగర్ ప్రింట్ క్లోనింగ్:
ఈ కేసుని మరింత లోతుగా విచారించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. అతడి పేరు గౌరవ్. తాను ఎలా మోసం చేస్తున్నది గౌరవ్ చెప్పాడు. గౌరవ్ మాటలు విని పోలీసులు విస్తుపోయారు. కేవలం 5రూపాయల ఖర్చుతో ఈ మోసానికి పాల్పడినట్టు తెలిపాడు. గ్లూ గన్(glue gun-జిగురుని కరిగించేందుకు వాడే పరికరం), జిగురు సాయంతో ఫింగర్ ప్రింట్స్ క్లోన్ చేసి బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసినట్టు వివరించాడు. క్లోనింగ్ చేసే టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావ్ అంటే, ఇంటర్నెట్ లో చూసి అని చెప్పాడు. ఈ కేసులో పోలీసులు 26ఏళ్ల గౌరవ్ తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. గౌరవ్ డిగ్రీ చదువుకున్నాడు. జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

నిందితుల నుంచి 500మంది బాధితుల క్లోన్డ్ వేలిముద్రలు, పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను షాజహాన్ పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ మిత్రాస్ వేలిముద్రలు క్లోన్ చేయడానికి గౌరవ్.. గ్లూ గన్, జిగురు వాడినట్టు తేలింది.

”బాధితుల్లో చాలా మంది నిరక్ష్యరాసులు. ఇది, గౌరవ్ కు బాగా కలిసొచ్చింది. ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ టెక్నిక్.. ఇంటర్నెట్ లో ఉంది. దీన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి కంటెంట్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటాం” అని ఐజీ రాజేష్ పాండే తెలిపారు.

హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే:
* వెబ్ సైట్లు, అప్లికేషన్లు, సిస్టమ్స్ కు హై స్ట్రెంత్ పాస్ వర్డ్ పెట్టుకోవాలి
* టూ ఫ్యాక్టర్ అతెన్ సియేషన్ ఏర్పాటు చేసుకోవాలి
* వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్స్, ఫేసియల్ జియోమెట్రీ వంటివి పాస్ వర్డ్ గా పెట్టుకోకపోవడమే మంచిది
* వేలి ముద్రలు, బయోమెట్రిక్స్ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి
* వాటిని రీసెట్ చేయడం కష్టం, అందుకే పాస్ వర్డ్ గా పెట్టుకోకపోవడమే మంచిది.