Updated On - 2:42 pm, Fri, 5 February 21
man kills lover and commits suicide: మైసూరులో దారుణం జరిగింది. ఓ పెళ్లయిన వ్యక్తి చేసిన పని రెండు ప్రాణాలు తీసింది. పెళ్లయిన వ్యక్తి తన ప్రియురాలిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య జిల్లాలోని హొంబలే కొప్పలు గ్రామానికి చెందిన లోకేష్ కాంట్రాక్టర్. అతడికి పెళ్లైంది. ఓ కూతురు కూడా ఉంది.
అయితే మైసూరులో ఎమ్మెస్సీ చదువుతున్న అమూల్యతో లోకేష్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా లవ్ గా మారింది. అయితే తనకు వివాహం అయిన విషయాన్ని లోకేష్ దాచాడు.
కొన్ని రోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అమూల్య లోకేష్ ని అడిగింది. అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో లోకేష్ భయపడ్డాడు. తన వ్యవహారం బయటపడుతుందని ఆందోళన చెందాడు. ఆమె అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. మాట్లాడాలని చెప్పి మైసూరులోని ఓ హోటల్ కి అమూల్యను తీసుకెళ్లిన లోకేష్ అక్కడ దారుణానికి ఒడిగట్టాడు. అమూల్య గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన స్నేహితునికి ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి స్నేహితుడు, పోలీసులు వచ్చి చూసేసరికి ఇద్దరూ చనిపోయి కనిపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.
Selfie: సెల్ఫీ మోజులో.. ప్రేమజంట మృతి
Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన
Nalanda crime : వరుడికి లవ్ ఎఫైర్..వధువు కాళ్లూ చేతులు కట్టేసి తల నరికేసిన దారుణం
Old Couple Marriage: ఆమెకు 73.. ఆయనకు 69.. త్వరలోనే పెళ్లి
జాగ్రత్త.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి.. డేట్ మార్చి హల్దీరామ్ ఫుడ్స్ అమ్మకాలు..
Bharat Bandh : ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు