Cooler made of drum : నీళ్ల డ్రమ్మే.. కానీ అతని చేతిలో కూలర్‌గా మారిపోయింది..

కొందరు కొన్ని వస్తువులను క్రియేటివ్‌గా ఎలా వాడాలని ఆలోచిస్తారు. ఓ వ్యక్తికి వాటర్ డ్రమ్ముతో కూలర్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. వెంటనే అమలు పరిచాడు. డ్రమ్ము కూలర్ అదరహో అంటున్నారు నెటిజన్లు.

Cooler made of drum : నీళ్ల డ్రమ్మే.. కానీ అతని చేతిలో కూలర్‌గా మారిపోయింది..

Cooler made of drum

Viral Video : ఎండాకాలం చివర్లో ఉన్నా.. ఇంకా ఎండలు అదరగొడుతున్నాయి. కూలర్లు, ఏసీలు ఇంకా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వెళ్లాలంటేనే ఉక్కపోతకి జనాలు భయపడుతున్నారు. రీసెంట్ గా ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ ఆటోడ్రైవర్ ఆటోకి కూలర్ అటాచ్ చేసిన వీడియో చూసాం. ఇప్పుడు ఒకరు నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేసారు. అతని క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేరు.

Cooler Auto : ‘కూలర్ ఆటో చూసారా?’ ఆటో డ్రైవర్ సూపర్ ఐడియా

మండే ఎండల నుంచి సామాన్యుడు ఉపశమనం పొందేది కూలర్లతోనే. అవి మార్కెట్లో దొరుకుతాయి. కానీ క్రియేటివ్ గా మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అని ఐడియా వచ్చిందేమో.. ఓ వ్యక్తి నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేసాడు. చూస్తే ఔరా అంటారు. ప్రస్తుతం ఆ డ్రమ్ముతో చేసిన కూలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్ములు ఉంటాయి కదా.. ఆ డ్రమ్ముకి ఓ ఫ్యాను, మోటారు, కూలర్ గ్రాస్ ఉపయోగించాడు. వెనుకాల కొంత భాగాన్ని కత్తిరించి ఓ వైపు ఫ్యాన్ బయిటకు ఉండేలా ఫిక్స్ చేశాడు. వెనుక భాగంలోనే గ్రాస్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఇక డ్రమ్ముకి ఏర్పాటు చేసిన స్విచ్ నొక్కితే చల్ల చల్లని గాలి.. ఆహా అనాల్సిందే.

Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..

vikramv5840 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తరువాత వాషింగ్ మెషీన్ తయారు చేయమని ఒకరు.. ఇలాంటి అద్భుతాలు ఇండియాలో మాత్రమే చూడగలమని మరొకరు.. వరుసగా కామెంట్లు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Vicky Sharma (@vikramv5840)