Man Slips Into Coma: దోమ కుట్టడంతో 4 వారాలు కోమాలో యువకుడు.. 30 ఆపరేషన్లు

ఒకే ఒక్క దోమ కుట్టిన కారణంగా జర్మనీకి చెందిన ఓ యువకుడు నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. అంతేకాదు, 30 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. జర్మనీలోని రోడర్‌మార్క్ కు చెందిన సెబాస్టియన్ రోట్‌ష్కే (27)ను 2021 వేసవికాలంలో ఓ ఆసియన్ టైగర్ దోమ కుట్టింది. అతడిలో మొదట ఫ్లూ వంటి లక్షణాలు కనపడ్డాయి. చివరకు ఆ లక్షణాలు పెరిగాయి. అతడి కాలి రెండు వేళ్లను పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది. అక్కడితోనూ అతడి ఆరోగ్య సమస్యలు నయం కాలేదు.

Man Slips Into Coma: దోమ కుట్టడంతో 4 వారాలు కోమాలో యువకుడు.. 30 ఆపరేషన్లు

Man Slips Into Coma

Man Slips Into Coma: దోమలవల్ల పలు రకాల రోగాలు వస్తాయని అందరికీ తెలుసు. మన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా దోమ కుట్టడం వల్ల డెంగీ, మలేరియా వంటి రోగాలు వస్తాయి. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స తీసుకుంటే కొన్ని రోజులకి తగ్గిపోతాయి. అయితే, ఒకే ఒక్క దోమ కుట్టిన కారణంగా జర్మనీకి చెందిన ఓ యువకుడు నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. అంతేకాదు, 30 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది.

జర్మనీలోని రోడర్‌మార్క్ కు చెందిన సెబాస్టియన్ రోట్‌ష్కే (27)ను 2021 వేసవికాలంలో ఓ ఆసియన్ టైగర్ దోమ కుట్టింది. అతడిలో మొదట ఫ్లూ వంటి లక్షణాలు కనపడ్డాయి. చివరకు ఆ లక్షణాలు పెరిగాయి. అతడి కాలి రెండు వేళ్లను పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది. అక్కడితోనూ అతడి ఆరోగ్య సమస్యలు నయం కాలేదు. రక్తం విషపూరితంగా మారిపోయింది. వరుసగా కాలేయం, కిడ్నీ, హృదయ, ఊపిరితిత్తుల వైఫల్యంతో బాధపడ్డాడు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

అతడి తొడ భాగంలో చీము పట్టడంతో అతడికి వైద్యులు చర్మ మార్పిడి ఆపరేషన్ కూడా చేశారు. తన ఎడమ తొడలో సగభాగాన్ని బాక్టీరియా తినేసిందని, తానిక బతకకపోవచ్చని సెబాస్టియన్ రోట్‌ష్కే భావించాడు. ‘‘నేను విదేశాలకు వెళ్లలేదు. జర్మనీలోనే నన్ను దోమ కుట్టింది. మెల్లిగా ఆరోగ్య సమస్యలు పెరుగుతూ వచ్చాయి. పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాను.

బాగా జ్వరం వచ్చింది. ఏమీ తినలేకపోయాను. ఇక నా పని అయిపోయిందని అనుకన్నాను. నా ఎడమ తొడపై చీము పట్టింది. నన్ను ఆసియన్ టైగర్ దోమ కుట్టిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు తన పరిస్థితి కాస్త కుదుటపడింది, భయంకర దోమలకు అందరూ దూరంగా ఉండాలి’’ అని సెబాస్టియన్ రోట్‌ష్కే అన్నాడు. ఆసియన్ టైగర్ దోమలను అటవీ దోమలు అని కూడా అంటారు. పగటిపూట ఇవి కుడతాయి. వీటి వల్ల మెదడువాపు, జికా వైరస్, వెస్ట్ లైన్ వైరస్, చికున్ గున్యా, డెంగీ జ్వరం వంటివి సంభవిస్తాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..