Chennai : రూ.10 ఛాలెంజ్ కోసం ఇంత దిగజారుడా?
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్‌లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు.

Chennai
Chennai Viral News : ఇన్‌స్టాగ్రామ్‌లో 10 రూపాయల ఛాలెంజ్‌ని స్వీకరించాడట.. చెన్నైలో ఓ యువకుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఇంకేముంది పోలీసులు అరెస్టు చేశారు.
నడిరోడ్డుపై ముద్దులు పెట్టుకోవడం.. స్నానాలు చేయడం.. డ్యాన్స్‌లు చేయడం ఇవన్నీ వైరల్ అవ్వడానికి కొందరు ఎంచుకుంటున్న మార్గాలు. వైరల్ అవ్వడమేమో కానీ పోలీసు కేసుల్లో ఇరుక్కుని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. చెన్నిమలై సమీపంలోని వెల్లోట్‌కు చెందిన పార్థిబన్ అనే 26 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 రూపాయల ఛాలెంజ్‌ని స్వీకరించాడట.
ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో మీనాక్షి సుందరనార్ రోడ్డుపై మోపెడ్‌పై వస్తూ సిగ్నల్ దగ్గర ఆగాడు. తన వెంట నీళ్లు నింపి తెచ్చుకున్న బకెట్ నుంచి నీళ్లు తీసుకుని తలపై పోసుకుంటూ స్నానం చేయడం మొదలుపెట్టాడు. అతనిని అనుసరించిన అతని స్నేహితులు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. సిగ్నల్ పడిపోయినా అతను ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు అతనివైపు విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు.
ఈరోడ్ నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో పన్నీర్ సెల్వం పార్క్ జంక్షన్ ఒకటి. గాంధీజీ రోడ్, మీనాక్షి సుందరనార్ రోడ్, కచేరి రోడ్, నేతాజీ రోడ్ మరియు తిరువెంకట రోడ్డు ఇక్కడ 5 రోడ్లు కలుస్తాయి. ఇందులో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, కార్పొరేషన్ కార్యాలయం, తాలూకా కార్యాలయం మరియు బట్టల షాపులు, నగల దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నిత్యం జనసంచారంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో పార్థిబన్ చేసిన ఫీటు చూసి జనాలకు చిర్కెత్తుకొచ్చింది.
Chennai : నా డెత్ సర్టిఫికేట్ రద్దు చేయండి.. చెన్నైలో 10 నెలలుగా ఓ వ్యక్తి పోరాటం..
ఇక పార్థిబన్‌కి ఇలాంటి ఫీట్లు అలవాటేనట. రాత్రిపూట మార్గమధ్యంలో పడుకోవడం, పచ్చి చేపలు తినడం, రాత్రి బావిలో స్నానం చేయడం వంటి ఛాలెంజ్‌లు చేశాడని తెలుస్తోంది. ఇక తాజాగా చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టి పార్థిబన్‌ను అరెస్టు చేశారు.