Children Street Play: వీధుల్లో ఆడితే కాల్చిపారేస్తానంటూ పిల్లలకు వార్నింగ్

బర్త్ డే పార్టీ రోజు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను ఆట మానేసి అక్కడి నుంచి వెళ్లాలని బెదిరించాడు. లేదంటే కాల్చి పారేస్తానని చెప్పడమే కాకుండా అన్నంత పని చేశాడు. ఆమీర్ అలియాస్ హంజా (22) అనే వ్యక్తిని న్యూ సీలాంపూర్ లో ఉంటున్నాడు. రోజువారీ కూలీగా పనిచేసే అతనిపై మరో కేసు కూడా నమోదై ఉంది.

Children Street Play: వీధుల్లో ఆడితే కాల్చిపారేస్తానంటూ పిల్లలకు వార్నింగ్

 

 

Children Street Play: బర్త్ డే పార్టీ రోజు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను ఆట మానేసి అక్కడి నుంచి వెళ్లాలని బెదిరించాడు. లేదంటే కాల్చి పారేస్తానని చెప్పడమే కాకుండా అన్నంత పని చేశాడు. ఆమీర్ అలియాస్ హంజా (22) అనే వ్యక్తిని న్యూ సీలాంపూర్ లో ఉంటున్నాడు. రోజువారీ కూలీగా పనిచేసే అతనిపై మరో కేసు కూడా నమోదై ఉంది.

ఆగష్టు 6న నిందితుడు మరో ఫంక్షన్ కు కూడా అటెండ్ అయ్యాడు. కుతుబుద్దీన్ అతని కొడుకు సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అక్కడే ఇదంతా జరిగింది.

కాల్పుల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ముగ్గురు చిన్నారులను స్థానికులు, కుటుంబ సభ్యుల సహకారంతో జేపీసీ హాస్పిటల్ కు తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితికి ప్రమాదం లేదని వివరించారు.

Read Also : గోడ మీద బల్లిపై గన్ తో కాల్పులు

కంప్లైంట్ చేసిన వసీం అతని ఫిర్యాదులో ఆమీర్ చేతిలో గన్ పెట్టుకుని వీధుల్లో ఆడొద్దని బూతులు తిట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్తుండగా గొడవ పెద్దది అయిందని పేర్కొన్నాడు. 7 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారుల బుల్లెట్ ప్రభావంతో గాయాలకు గురయ్యారు. ఆమీర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు.

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొద్ది గంటల్లోనే నిందితుడ్ని పట్టుకోగలిగామని డీసీపీ సంజయ్ సైన్ సింగ్ తెలిపారు.