Khargone: ఎస్పీపై కాల్పులు.. నిందితుడి అరెస్టు

శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు.

Khargone: ఎస్పీపై కాల్పులు.. నిందితుడి అరెస్టు

Khargone

Khargone: శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాత్రపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖార్గోన్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదురి, తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు. ఎస్పీ కాలుపై కాల్పులకు పాల్పడ్డాడు. తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు.

Madhya Pradesh : మైనర్ బాలికపై అత్యాచారం-మహంతు, అనుచరుడి ఇళ్లు నేల మట్టం

అప్పట్నుంచి పోలీసులు మోసిన్ కోసం వెతుకుతున్నారు. అతడితోపాటు దాడులకు పాల్పడ్డ ఇతర నిందితులపై కూడా పోలీసులు పదివేల రూపాయల రివార్డు ప్రకటించారు. కాగా, ఖార్గోన్ పరిధిలోని కస్రావాద్ దగ్గర నిందితుడు మోసిన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ హింసకు కారణమైన మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.