తిండికి తిమ్మరాజులు.. పనికి పోతరాజులు.. మన ‘జాతిరత్నాలు’..

తిండికి తిమ్మరాజులు.. పనికి పోతరాజులు.. మన ‘జాతిరత్నాలు’..

Mana Jathi Ratnalu: తమ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’.. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాతో కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘మన జాతి రత్నాలు’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రథన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. కాసర్ల శ్యామ్ ఫన్నీ లిరిక్స్‌తో ఆకట్టుకున్నారు. యంగ్ సెన్సేషనల్ సింగర్ రాహుల్ సిపిగ్లంజ్ చక్కగా పాడాడు.

https://10tv.in/jathi-ratnalu-movie-teaser/

ప్రధాన పాత్రల యొక్క తీరుతెన్ను ఎలాంటిదో తెలుపుతూ శ్యామ్ రాసిన లిరక్స్ నవ్వు తెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జాతి రత్నాలు’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.