ఆ నటుడిని చూసిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది

తమిళ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు నటి మంచు లక్ష్మి. సూర్య నటనను ఆకాశానికి ఎత్తేశారు.

  • Edited By: naveen , October 31, 2020 / 02:13 PM IST
ఆ నటుడిని చూసిన ప్రతిసారి నా ఒళ్లు గగుర్పొడుస్తుంది

తమిళ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు నటి మంచు లక్ష్మి. సూర్య నటనను ఆకాశానికి ఎత్తేశారు.

తమిళ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు నటి మంచు లక్ష్మి. సూర్య నటనను ఆకాశానికి ఎత్తేశారు. సూర్య గ్రేట్ అని, సూపర్ స్టార్ అని కితాబిచ్చారు. తాను ఎక్కువగా అభిమానించే నటుల్లో సూర్య అందరి కన్నా ముందు ఉంటారని చెప్పారు. హీరో సూర్యను చూసిన ప్రతిసారీ తన ఒళ్లు గగుర్పొడుస్తుందని మంచు లక్ష్మి అన్నారు. ఓ తమిళ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి సూర్య గురించి ప్రస్తావించారు.

”సూర్య ఓ గొప్ప నటుడు. అతడ్ని చూసిన ప్రతిసారీ నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రతి పోస్టర్ కొత్తగా ఉంటుంది. తను ఓ సూపర్ స్టార్ కాబట్టి.. ప్రతి సినిమాకు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆయనకు క్రేజ్ ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్, విజయ్ ఇలా అందరూ నాకిష్టమే. కానీ సూర్య విషయానికి వచ్చే సరికి.. వావ్ ఈసారి ఎలా చేశాడు, ఎలా కనిపించబోతున్నాడు అనే ఆతృత నాలో ఉంటుంది. ఆయన కోసం సినిమా చూస్తుంటా” అని లక్ష్మి చెప్పారు.

ఇప్పటికే పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి.. సూర్య గురించి ముచ్చటించారు. ఆయన తన అభిమాన నటుడని అన్నారు. ఆమె, జ్యోతిక, సూర్య స్నేహితులు కూడా. మంచు లక్ష్మి 2018లో కాట్రిన్ మొళి చిత్రంలో కనిపించారు. బాలీవుడ్ హిట్ తుమ్హారి సులుకి తమిళ రీమేక్ ఇది. జ్యోతిక ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్నేహితురాలిగా మంచు లక్ష్మి నటించారు.

Read  More:

*  నిత్యా మీనన్ ‘డిజైనర్ డ్రెస్’ వేలం.. కరోనా సాయం!

చార్మి బర్త్ డేకు ఎమోషనల్‌గా పూరీ జగన్నాథ్