Ginna Movie: ఎట్టకేలకు ఓటీటీలో జిన్నా ల్యాండ్ అవుతున్నాడుగా..!
యంగ్ హీరో మంచు విష్ణు నటించిన రీసెంట్ మూవీ ‘జిన్నా’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువగా ఉండటంతో, థియేట్రికల్ రన్‌లో ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది. ఇక జిన్నా సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అభిమానులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

Ginna: యంగ్ హీరో మంచు విష్ణు నటించిన రీసెంట్ మూవీ ‘జిన్నా’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హాట్ భామలు నటిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువగా ఉండటంతో, థియేట్రికల్ రన్‌లో ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది.
Ginna: జిన్నా, ఓరి దేవుడా చిత్రాలకు బ్యాడ్ ‘టైమ్’ ఎఫెక్ట్..?
ఇక జిన్నా సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అభిమానులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో జిన్నా మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. తాజాగా జిన్నా మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో రెడీ అయ్యింది. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ, ఈ సినిమాను రేపటి నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
Ginna Movie: మంచు విష్ణు ‘జిన్నా’ ప్రమోషనల్ టూర్
ఈ సినిమాలో విష్ణుతో పాటు అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. ఈషాన్ సూర్య తెరకెక్కించిన ‘జిన్నా’ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.