Mangaluru Blast: మంగళూరులో రోడ్డుపై ఆటో పేలుడు ఘటన ఉగ్ర చర్యే.. నిర్ధారించిన పోలీసులు

‘‘నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు’’ అని డీజీపీ చెప్పారు. దీనిపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా స్పందిస్తూ... పోలీసులు జరుపుతున్న విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు.

Mangaluru Blast: మంగళూరులో రోడ్డుపై ఆటో పేలుడు ఘటన ఉగ్ర చర్యే.. నిర్ధారించిన పోలీసులు

Mangaluru Blast

Mangaluru Blast: కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందికాదని, అది ఉగ్ర చర్య అని పోలీసులు నిర్ధారించారు. నిన్న ఈ ఘటన చోటుచేసుకుని ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై కర్ణాటక డీజీపీ ట్విట్టర్ లో వివరాలు తెలిపారు.

‘‘నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు’’ అని డీజీపీ చెప్పారు. దీనిపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా స్పందిస్తూ… పోలీసులు జరుపుతున్న విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు.

ఆ పేలుడుకు సంబంధించిన సమాచారాన్నంతా పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు. మంగళూరుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు తెలిపారు. పేలుడుపై రెండు రోజుల్లో పూర్తి సమాచారం రాబడతామని అన్నారు. నిన్న జరిగిన పేలుడు మంగళూరు ప్రజల్లో భయాందోళనలు రేపింది. కాగా, ఆటో రిక్షాలో నుంచి పోలీసులు కాలిపోయిన ప్రెజర్ కుక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..