Manisha Ropeta: పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీగా మనీషా

పాకిస్తాన్‌లో మనీషా రూపేత అనే మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో డీఎస్పీ హోదా సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.

Manisha Ropeta: పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీగా మనీషా

Manisha Ropeta

Manisha Ropeta: పాకిస్తాన్‌లో మనీషా రూపేత అనే మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో డీఎస్పీ హోదా సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. పురుషాధిక్యత కలిగిన పాకిస్తాన్ వంటి దేశంలో మహిళలు వివిధ రంగాల్లో రాణించడం చాలా అరుదు. అందులోనూ పోలీసు శాఖలో ఒక హిందూ మహిళ ఉద్యోగం పొందడం అరుదైన విషయం.

Surname Of Child: పిల్లల ఇంటిపేర్లు తల్లుల ఇష్టం: సుప్రీం కోర్టు

అలాంటి ఘనత సాధించారు మనీషా రూపేత. ఆమె పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన జకోబాబాద్‌లోని మధ్య తరగతి హిందూ కుటుంబలో జన్మించారు. నిజానికి మనీష చిన్నప్పట్నుంచి డాక్టర్ కావాలనుకుంది. ఆమె సోదరీమణులు ముగ్గురూ డాక్టర్లే. ఆమె తమ్ముడు కూడా ప్రస్తుతం డాక్డర్ కోర్స్ చదువుతున్నాడు. తాను ఒక్క మార్కు తేడాతో మెడిసిన్ సీటు కోల్పోయానని చెప్పింది. ఆ సమయంలో ఫిజికల్ థెరపీ కోర్సు చేయాలనుకుంది. కానీ, సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి, అర్హత సాధించింది. అలా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది.

Bandla Ganesh : హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత మనకి లేదు..

‘‘ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేయాలంటే డాక్టర్లు, టీచర్లుగానే ఉండాలని చాలా మంది నా చిన్నప్పట్నుంచి చెబుతున్నారు. ఈ ఆలోచనను మార్చాలనుకుంటున్నాను. పోలీసు శాఖలో మహిళలు ఎక్కువ మంది చేరేలా ప్రోత్సహిస్తాను. పోలీసుగా పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని మనీషా అన్నారు. ప్రస్తుతం ఆమె శిక్షణలో ఉన్నారు. తర్వాత క్రైమ్స్ ఎక్కువగా జరిగే ల్యారీ ప్రాంతంలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వనున్నారు.