Manjula : బాలకృష్ణకు హీరోయిన్‌గా మహేష్ సోదరి.. విషయం తెలిసి గొడవ చేసిన ఘట్టమనేని అభిమానులు..

సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి కూడా కొంతమంది సినీ పరిశ్రమలోకి వచ్చారు. కృష్ణ పిల్లల్లో రమేష్ బాబు కొన్ని సంవత్సరాలు హీరోగా చేశారు. మహేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ గా..........

Manjula : బాలకృష్ణకు హీరోయిన్‌గా మహేష్ సోదరి.. విషయం తెలిసి గొడవ చేసిన ఘట్టమనేని అభిమానులు..

Balakrishna

Balakrishna :  సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి కూడా కొంతమంది సినీ పరిశ్రమలోకి వచ్చారు. కృష్ణ పిల్లల్లో రమేష్ బాబు కొన్ని సంవత్సరాలు హీరోగా చేశారు. మహేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ గా వెలుగుతున్నారు. ఇక కృష్ణ కూతుళ్లలో మంజుల ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంజుల గతంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మంజుల ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇందులో భాగంగానే గతంలో జరిగిన ఓ సంఘటన షేర్ చేసుకుంది.

మంజులకి కూడా నటన అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ లో కోచింగ్ కూడా తీసుకుంది. కృష్ణని ఒప్పించి హీరోయిన్ అవ్వడానికి రెడీ అయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన టాప్ హీరో సినిమాలో మొదట మంజులని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ విషయం అనౌన్స్ చేసి ప్రారంభోత్సవం కూడా మొదలు పెట్టారు. అయితే ప్రారంభోత్సవానికి ఘట్టమనేని అభిమానులు వచ్చి రచ్చ రచ్చ చేసి వెళ్లారు.

కృష్ణ గారి కూతురు అంటే మాకు సోదరితో సమానం. అలాంటిది మంజుల గారిని హీరోయిన్ గా చూడలేము, చేయడానికి వీల్లేదు అని నానా రభస చేశారు కృష్ణ అభిమానులు. ఆ ప్రాంగణాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇంకేముంది కృష్ణ మంజులకి నచ్చ చెప్పి హీరోయిన్ ప్రయత్నం విరమించేలా చేశారు. ఆ తర్వాత టాప్ హీరో సినిమాని బాలకృష్ణ సరసన సౌందర్యతో తీశారు.

Allu Aravind : అల్లు అర్జున్ ఆ థియేటర్లోనే ముసుగు వేసుకొని సినిమా చూస్తాడు..

ఇక మంజుల ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ ప్రయత్నాలు చేయలేదు. కొన్ని సంవత్సరాలు అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తూ వస్తుంది. తనకి హీరోయిన్ అవ్వాలనే కోరిక అలా మిగిలిపోయిందని జరిగిన సంగతిని తెలిపింది. ఈ విషయం తెలిసి మంచి హీరోయిన్ ని మిస్ అయ్యాము అని ఇప్పటి ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటి ప్రేక్షకుల్లా ఓపెన్ గా ఆలోచిస్తే మంజుల కచ్చితంగా హీరోయిన్ అయి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.