PM Modi : మోదీ మన్ కీ బాత్, 81వ ఎపిసోడ్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు నిర్వహించే మన్ కీ బాత్ ఎప్పటిలాగానే ప్రసారం కానుంది. ఆల్ ఇండియా రెడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కానుంది.

PM Modi : మోదీ మన్ కీ బాత్, 81వ ఎపిసోడ్

Modi

Mann ki Baat : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు నిర్వహించే మన్ కీ బాత్ ఎప్పటిలాగానే ప్రసారం కానుంది. ఆల్ ఇండియా రెడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కానుంది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం 81వ ఎపిసోడ్ లో ఉదయం 11గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. మన్ కీ బాత్ లో తన ఆలోచనలు ప్రజలతో పంచుకుంటారు. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు.

Read More : Hyderabad Thefts: రాష్ట్ర రాజధానిని నమ్మకంతో ముంచేస్తున్న నేపాలీ గ్యాంగ్

అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, టాప్ సీఈవోలు, ఆస్ట్రేలియా పీఎం, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ లతో మోదీ భేటీ అయ్యారు. పర్యటన ముగిసిన అనంతరం ఐక్యరాజ్య సమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఉగ్రవాదం కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. ఇక మన్ కీ బాత్ విషయానికి వస్తే…AIR, Doordarshan ప్రసారం చేయబడుతుంది. అంతేగాకుండా… www.newsonair.com మరియు newsonair మొబైల్ యాప్ లో ప్రసారం చేయబడుతుంది.

Read More : Hyderabad : నగరంలో కుండపోత..ట్రాఫిక్ అస్తవ్యస్తం, స్తంభించిన జనజీవనం

AIR, DD న్యూస్, PMO, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలోని YouTube ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆయన చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేతలను ప్రశంసించారు. మేజర్ ధ్యాన్ చంద్ కు నివాళి అర్పించారు. 40 సంవత్సరాల తర్వాత…ఒలింపిక్స్ హాకీలో పతకం గెలవడం జరిగిందని, మేజర్ ధ్యాన్ చంద్ ఎంతో సంతోషంగా ఉంటారో ఆలోచించాలని ఆయన వెల్లడించారు.