The Family Man : ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3 త్వరలో.. సమంతకి ఛాన్స్ ఇస్తారా??

 ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్ కొట్టడంతో సీజన్ 2ని కూడా తీశారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2లో సమంత...........

The Family Man : ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3 త్వరలో.. సమంతకి ఛాన్స్ ఇస్తారా??

Manoj Bajpayee comments on the family man season 3

The Family Man :  ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్ కొట్టడంతో సీజన్ 2ని కూడా తీశారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2లో సమంత కూడా నటించి మెప్పించింది. సీజన్ 2 మొదటి సీజన్ కంటే పెద్ద హిట్ అయింది.

దీంతో ఈ సిరీస్ దర్శక నిర్మాతలు రాజ్ అండ్ డీకే కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఈ సిరీస్ కి పలు అవార్డులు కూడా వచ్చాయి. గతంలోనే ఈ సిరీస్ కి సీజన్ 3 ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఉంటుందో తెలీదు అని దర్శకులు తెలిపారు. అభిమానులు కూడా ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3 కావాలని అనుకుంటున్నారు. తాజాగా ఈ సిరీస్ లో ముఖ్య పాత్రధారి అయిన మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీజన్ 3 గురించి చెప్పాడు.

మనోజ్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్ సీజన్ 3 తెరకెక్కించడానికి అమెజాన్ సిద్దంగానే ఉంది. కానీ నేను, దర్శకులు రాజ్ అండ్ డీకే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాము. మా ప్రాజెక్టులు అయ్యాక ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3 ఉంటుంది. బహుశా వచ్చే సంవత్సరం ఈ సిరీస్ ప్రారంభం కావొచ్చు అని తెలిపారు. దీంతో ఈ సిరీస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun : రష్యాలో పుష్ప..? రష్యాకి చెక్కేస్తున్న బన్నీ??

అయితే సీజన్ 2లో సమంత కూడా చాలా ప్లస్ అయింది సిరీస్ కి. సమంత క్యారెక్టర్ కి మంచి ప్రశంసలు దక్కాయి. మరి సీజన్ 3లో కూడా సమంత ఉంటుందా అని అభిమానులు అడుగుతున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే గతంలో సమంతతో ఒక ప్రాజెక్టు చేస్తాం అన్నారు. మరి ఆ మాట ప్రకారం అయినా ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 3లో సమంతని తీసుకుంటారో చూడాలి. సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇంటివద్దే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వాళ్ళు ఆఫర్ ఇచ్చినా సమంతా ఒప్పుకుంటుందా చూడాలి.