Sleeplessness : రాత్రి నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు!

నిద్రలేమి వల్ల భావోద్వేగాల్లో మార్పులు చివరకు మానసిక సమస్యలకు దారితీస్తాయి. నరాల సంబంధిత వ్యాధులకు కారణంగా మారతాయి. దంపతుల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు నిద్రలేమి ప్రభావం చర్మంపై పడుతుంది. కళ్ల క్రింద నలుపుతోపాటు చర్మం కాంతి విహీనంగా మారుతుంది. జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని నిపుణులు చెబుతన్నారు.

Sleeplessness : రాత్రి నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు!

Heart (2)

Sleeplessness : మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం ఎంతముఖ్యమో అలాగే నిద్ర కూడా అంతే ముఖ్యం. జీవనశైలి, అలవాట్లలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది రాత్రి నిద్రకు దూరమౌతున్నారు. నిద్రలేని రాత్రులను గడుపుతూ అనేక అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 7 నుండి 8గంటల నిద్ర అనేది చాలా అవసరం. అలా కాకుండా నిద్రపోకపోవటం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడు పనితీరు నిద్రలేమి కారణంగా మందిగిస్తుంది. ఒత్తిడికి లోనై దాని ప్రభావంతో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీని ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

నిద్రలేమి లెప్టిన్ హార్మోన్ యొక్క స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో ఆకలి అధికంగా వేయటంతో మోతాదుకు మించి ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధకశక్తి స్పందనపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. రాత్రి నిద్రపోని వారిలో రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఇది క్రమేపి గుండె పనీతీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే మధుమేహానికి కారణమౌతుంది. ఇన్సులిన్ నియంత్రణ కొరవడుతుంది.

నిద్రలేమి వల్ల భావోద్వేగాల్లో మార్పులు చివరకు మానసిక సమస్యలకు దారితీస్తాయి. నరాల సంబంధిత వ్యాధులకు కారణంగా మారతాయి. దంపతుల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు నిద్రలేమి ప్రభావం చర్మంపై పడుతుంది. కళ్ల క్రింద నలుపుతోపాటు చర్మం కాంతి విహీనంగా మారుతుంది. జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని నిపుణులు చెబుతన్నారు.

రాత్రి నిద్రలేమి నుండి బయటపడేందుకు రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రించేందుకు అవసరమైన వాతావరణం గదిలో ఉండేలా చూసుకోవాలి. గద చీకటిగా, చల్లటి వాతావరణం తో నిండి ఉండాలి. నిద్రకు గంటముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. కెఫిన్ తో కూడిన టీ, కాఫీలు తీసుకోకూడదు. మద్యం జోలికి వెళ్లకూడదు. ఇలాంటి అలవాట్ల ద్వారా రాత్రి ప్రశాతంగా నిద్రించేందుకు అవకాశం ఉంటుంది.