YCP MP Margani Bharat : రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలి..స్పీకర్‌‌కు ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం మళ్ల తెరపైకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రఘురామ అతిక్రమించారని ఆరోపించారు.

YCP MP Margani Bharat : రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలి..స్పీకర్‌‌కు ఫిర్యాదు

Margani Bharat Demands Disqualify Mp Raghurama Krishnam Raju

MP Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం మళ్ల తెరపైకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రఘురామ అతిక్రమించారని ఆరోపించారు. వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు భరత్ విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకున్న అనంతరం స్పీకర్ కు భరత్ ఫిర్యాదు చేయడం గమనార్హం.

గతంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే..ఈ వ్యాఖ్యలను రఘురామ సమర్థించుకున్నారు. ప్రభుత్వంపై తాను చేసినట్లుగా చూడాలి..కానీ..పార్టీపై చేస్తున్నట్లుగా చూడొద్దని ఆయన సూచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కిందకు రాదని, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై స్పీకర్‌కు సైతం క్లారిటీ ఇచ్చారు.

అయితే..తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీఐడీ కేసు, రఘురామకృష్ణంరాజు అరెస్టు జరిగాయి. విడుదలైన అనంతరం జైలులో చిత్రహింసలకు గురి చేశారు..ఎంపీ అని చూడలేదని..గౌరవానికి భంగం కలిగిందని..సీఐడీపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివిధ కేంద్ర మంత్రులను కలవడం, సీఎంలకు లేఖలు రాయడంపై వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ చేసిన ఫిర్యాదుపై ఎంపీ రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More : ED Raids : ఎంపీ నామా ఇంట్లో కొనసాగుతున్న సోదాలు