Covid-19: మాస్క్ ఎక్కువగా పెట్టుకోకండి – కాంగ్రెస్ ఎమ్మెల్యే

మాస్క్ అనేది రెగ్యూలర్ లైఫ్ లో భాగం అయిపోయింది. 2019లో కొవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇన్ఫెక్షన్ అడ్డుకోవడం కోసం తప్పనిసరిగా మారాయి మాస్కులు.

Covid-19: మాస్క్ ఎక్కువగా పెట్టుకోకండి – కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress Mla

Covid-19: మాస్క్ అనేది రెగ్యూలర్ లైఫ్ లో భాగం అయిపోయింది. 2019లో కొవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇన్ఫెక్షన్ అడ్డుకోవడం కోసం తప్పనిసరిగా మారాయి మాస్కులు. కొవిడ్-19 ప్రొటోకాల్స్ లోనూ మాస్క్ ధరించడాన్ని చేర్చి నియమాలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధిస్తున్నారు. వీటిన్నిటికీ విరుద్ధంగా మాస్కులను రెగ్యూలర్ గా ఎక్కువ సేపు ధరించవద్దని చెబుతున్నారు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాణ్ అన్సారీ.

‘ఎవరైనా సరే. మాస్కును ఎక్కువగా వాడకూడదు. డాక్టర్ గానే కాకుండా నేను ఎమ్మెల్యేను కూడా. మాస్క్ ఎక్కువసేపు ధరించడం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని తెలుసు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిపోర్టర్లతో అన్నారు. అంతేకాకుండా మాస్కులు లేని వారితో పాటు కూర్చొని థర్డ్ వేవ్ అంత భయంకరంగా ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారు అతి త్వరగా నెగెటివ్ అయిపోతున్నారని జార్ఖండ్ లీడర్ చెప్పారు. కొద్ది రోజుల్లోనే రికవరీ అవుతున్నారు. పారాసిటమాల్ లాంటి మెడికేషన్ సరిపోతుందని వివరించారు.

ఇది కూడా చదవండి : నాటుకోళ్ల గుడ్ల ఉత్పత్తిలో జాగ్రత్తలు

కొద్ది రోజుల ముందే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు నెగెటివ్ రాగా అతని భార్య, కొడుక్కి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సీఎం ఇంటి నుంచి సేకరించిన 13శాంపుల్స్ లో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని హెల్త్ అఫీషియల్స్ వెల్లడించారు.