#RIPTwitter : రాజీనామాలతో కొత్త బాస్‌కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు.. #RIPTwitter అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్..!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించాడు.

#RIPTwitter : రాజీనామాలతో కొత్త బాస్‌కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు.. #RIPTwitter అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్..!

Mass resignation at Twitter Employees launches 'RIPTwitter' trend on platform

#RIPTwitter : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించాడు. అంతటితో ఆగలేదు.. మస్క్ అల్టిమేటం జారీ చేశాడు.. దాంతో వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన కొన్ని వారాల తర్వాత ఉద్యోగులందరిని తొలగించడంతో గందరగోళ పరిస్థితి మారింది.

Mass resignation at Twitter Employees launches 'RIPTwitter' trend on platform

Mass resignation at Twitter Employees launches ‘RIPTwitter’ trend on platform

ట్విట్టర్ ఉద్యోగులంతా మస్క్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరుగా ట్విట్టర్ కంపెనీ నుంచి రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. మస్క్ మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా ఉద్యోగులు ఎవరూ కూడా హాజరుకాలేదు. ట్విట్టర్ ఉద్యోగులంతా వరుస రాజీనామాలు చేయడంతో ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్విట్టర్ షట్‌డౌన్ అయ్యే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు.

ట్విట్టర్ ఉద్యోగులంతా వరుస రాజీనామాలు చేసిన నేపథ్యంలో ‘#RIPTwitter‘ ట్రెండ్‌ను ప్రారంభించారు. ఎందుకంటే వందలాది మంది కంపెనీ ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్న సోషల్ మీడియా కంపెనీని విడిచిపెడుతున్నారు. కొత్త బాస్ ఎలన్ మస్క్ అల్టీమేటం జారీ చేయడంతో బలవంతంగా వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాటపట్టారు.

ట్విట్టర్‌ ఉద్యోగులను అధిక గంటలు పనిచేయాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ మస్క్ ఆదేశించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగులంతా మస్క్ చర్యలను నిరసిస్తూ అందరూ కలిసి రాజీనామాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని #RIPTwitter పోస్ట్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Premium Phones : కొత్త ప్రీమియం ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదిగో మీ లిస్టు మీకోసమే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!